రైతన్న కేది స్వ’తంత్రం…!
వడ్డు గింజల చాటు క్రీడన
కేంద్రం ఆడే దోబూచులాట
రాష్ట్రమేమో పోరాటబాట
రైతేమో నిస్తేజపు మొగాన.
పీయుషు చేసే ప్రకటనలు
రైత్వారీ నడుం విరగొట్టు
కొనకముందే గోల్ మాలు
రోజు తప్పుడు విధానాలు.
పేరుకు ఉప్పుడు బియ్యం
భారతాన కొత్త పన్నాగం
వెన్నెముకకు చేసే గాయం
రాజే కూల్చే జనస్వతంత్రం.
సాగున చేసిన మాటలు
పంటన మాసిన బాసలు
మోడి చేస్తున్న గారడీలు
విభజించి పాలించే తీరు.
మర్లబడేను మన రైతాంగం
పోరాటంకు బిగించే నడుం రైతుకు కలగాలి న్యాయం
ఎలిగెత్తేను తెలంగాణం.
రైతు కన్నీట చుక్కలు
కాకూడదు విషాదాలు
రైత్వారి సుఖసంతోషాలు
దేశరాష్ట్రాలకు దివ్వెలు
కేసియార్ ఆలోచనలు
తెరాస మద్దతు పోరాటాలు
రైతాంగాన్ని ఆదుకునేలా
కేంద్ర మదపుటేనుగును కట్టేలా…
మరో స్వాతంత్ర్యసమరం పూరించే విప్లవ శంఖం
కేంద్రం తీరు మారేలా
రైతన్నకు స్వ’తంత్రం కలిగేలా!.
జై రైతన్న..జై జై తెలంగాణ.
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
9391456575.