*కీర్తించిన ప్రతిభ*
కీర్తి నాంపల్లి రైల్వేస్టేషన్ లో నడచి వచ్చిన దేవతలా ఒళ్ళంతా నగలతో,పట్టు పరికిణితో విధి నిర్వహణకై బయలుదేరుతు రైలు కోసం ఎదురు చూస్తుంది.అక్కడికి దగ్గర లో తన మిత్రుడైన తరుణ్ తో సంభాషిస్తున్నాడు కిరణ్.”ఏరా కిరణ్ అమెరికా నుంచి ఎపుడు వచ్చావ్?అంతా కుషలమే కదా!వాని వైపు చూస్తూ బాగానే డబ్బులు సంపాదించినట్లూ ఉన్నావ్ పెళ్ళి భోజనం తినిపించే మాట ఉందా ?లేదా?
ఏం పెళ్ళి రా తరుణ్ మా ముగ్గురు అన్నయ్య లు అమ్మానాన్నలు చూసిన సంబంధం చేసుకొని ఆనందంగా ఉన్నారు కాని నాకు వాళ్ళు చూసే సంబంధాలు నచ్చడం లేదంటూ చూపులు మరల్చాడు అంతే! పసినిమ్మ పండులా నిగనిగలాడుతూ అందాలు ఆరబోసుకుని నిలుచున్న కీర్తి వైపు చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనయాడు…ఏరా ఆ అమ్మాయి చూడూ నాకోసమే జన్మించినట్లుంది.
పిచ్చోడ ఊరుకో ఏం మాటలవీ ఆమే ఎవరో తెలియదు నీకోసం పుట్టడమేంటీ? “లేదురా! నేను ఎంతకాలం నుంచో వెతుకుతున్నా నా కలల రాణి రా తను,ఆమె నాకు కాబోయే భార్య ఇది పిక్స్.ఈ క్షణం నుంచే తనను ప్రేమించడం మొదలు పెడుతా!”మతిగాని చలించిందా?నీకు కాబోయే భార్య కలలో కనిపించడానికి ఇదేమైనా సినిమా నా?కొయ్ కొయ్ కోతలరాయా అని మనసులో గునుక్కున్నా బయటకు మాత్రం వాధించాడు తరుణ్, కాని కిరణ్ వింటే కదా…?అంతలో రైలు బండి రానె వచ్చింది ఆ ముద్దుగుమ్మ వీళ్ళ ముందునుంచి వెళ్ళిపోయింది.
రంగనాథం గారికి నలుగురు కుమారులు, ముగ్గురిని ఈ దేశంలో చదివించి,చిన్న కొడుకును మాత్రం గారాబం చేసి పెద్ద చదువుల కోసం చిన్నతనంలోనే అమెరికా పంపించాడు అదే రంగనాథం కు శాపంగా మారింది. “ధర్మోరక్షతి రక్షితః” “పరోపకారార్థం ఇదం శరీరం” అనే భావనతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు,ముగ్గురు కుమారులు ఉన్నత చదువుల చదువుకొని సమాజాన్ని చైతన్యం చేసే ఉపాద్యాయ వృత్తిని చేస్తున్నారు. ఏనాడు తండ్రి మాటను కాదనకుండా ఏ పని చేసేవారు కాదు కట్నకానుకలు తీసుకోకుండానే ముగ్గురు మేన మరదళ్ళను పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఉంటున్నారు. రంగనాథం కుమారుడు కిరణ్ విదేశాల నుంచి రాగానే తన చిన్న బామ్మర్ది కూతురు మయూరి తో వివాహం జరిపించాలని అనుకున్నాడు.కాని రంగనాథం ఆశలు ఆవిరై పోతాయని ఊహించలేదు పాపం.
చిన్నతనంలో అమెరికా పోయిన కిరణ్ అక్కడి సంస్కృతి కి అలవాటు పడి తండ్రి భావాలకు విరుద్ధంగా తయారై ఇంటికి వచ్చాడు. కొడుకు రాగానే అమ్మా అన్నా వదినలు ఏ పని చెప్పకుండా గారాబం చేసేవారు.కిరణ్ రోజు మందు కొడుతూ అమ్మాయి ల వెంట తిరుగుతూ రంగనాథం కు మనశ్శాంతి లేకుండా చేసేవాడు.అది గమనించిన తండ్రీ “ఏరా చిన్నా నిన్ను పెద్ద చదువుల కోసమని అమెరికా పంపిస్తే నీ చదువు పూర్తి చేసుకొని వచ్చావు ఏదైనా ఉద్యోగం చూసుకో,మామయ్య కూతురు మయూరితో పెళ్ళి జరిపిస్తా”అని అన్నాడు.నో డాడ్ నాకు ఆ అమ్మాయి నచ్చలేదు,తనను చేసుకోను.
రాజ్యం అంటుంది.”ఏరా చిన్ననాటి నుంచి మరదలు ను చేసుకుంటానని మురిసిపోయావు కదరా!ఇపుడేమైంది?”ఏంటమ్మా?నువు కూడా అలా అంటావు చిన్నప్పుడు సరదాకు అంటాం ఇపుడు చేసుకోవాలా ?ఏంటి?మరి కాకపోతే ఏంటీ ,నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మేనమామ సురేష్,మయూరి కి ఎన్ని సంబంధాలు వచ్చిన కాదని ఎదురు చూస్తున్నాడు.
నా కోసం ఏమి ఎదురు చూడలేదు తను ఎవ్వరికీ నచ్చలేదు కాబోలు అందుకే అలా అని చెప్పినట్లున్నాడు.
“ఎందుకురా అలా మాట్లాడుతావు నాకు పుట్టినిల్లు లేకుండా చేస్తావారా?”ఇంత వయసు వచ్చిన నీవే పుట్టినిల్లు అని,అన్నగారి కట్న కానుకలకు ఇంకా ఆశ పడుతున్నావు, నాకలాంటి ఆశలు లేవు నచ్చని అమ్మాయి ని చేసుకొని నేనెలా బ్రతకాలి?అయినా మేనరికాలు అంతా బావుండవు అంతేకాకా మయూరి మన ఇంట్లో సరిగా ఉండదు.” ఎందుకు ఉండదు మీ వదినలు ఉండడం లేదా?”
అప్పటి కాలం వేరు ఇప్పుడు నేను మేనరికం చేసుకోను ఎందుకంటే అనువంశికత ద్వారా అవిటి వారు పుడుతారు.
“ఏంట్రా ? ఆ మాటలు మీ వదినలు మేనమామ కూతుర్లే కదా!మేము చేసుకోలేదా ?పిల్లలు పుట్టలేదా?” అని అన్నాడు పెద్దన్నయ్య.
అన్నయ్య ఇది నా సమస్య మీరెవరు ఇందులోకి రాకండి ప్లీజ్.”మీ సమస్య అని వేరు చేస్తావేంట్రా “?మన భారతదేశం సంస్కృతి లో ఉమ్మడి కుటుంబ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి.అవి పాటించడం మన ధర్మం,అమ్మ నాన్న లను గౌరవించడం మన బాధ్యత, మనమంతా ఈ దేశ సంస్కృతి లో పెరిగాం”కాని నీకు నచ్చినట్లు నాకు నచ్చదు. నేను విదేశాల్లో ఉండి చదివాను అదే అలవాటైంది.
నిన్ను పంపింది మంచి చదువులు చదువుకొమ్మని కాని మాకు పాఠాలు చెప్పి సంస్కృతిని మార్చుతావని కాదురా?”నాన్న నువ్వేం మాట్లాడకు నేను చెప్పిందే చేస్తా అంతే….
చూశావటే రాజ్యం వాడు నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు,ఇన్నాళ్లు గా చిన్నవాడని ప్రేమగా, దూరంగా చదివిస్తే వాడు ఇలా తయారయ్యాడు,నేను అలా అనుకోలేదే మంచి ఉద్యోగం వస్తుంది అని పంపించా!
ఏం చదువులయ్యా వీళ్ళు ముగ్గురు చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తలేరా!”వాడే ఏదో ఒకటి చేసుకుంటాడు ఇన్నాళ్లు చదివి ఉద్యోగం లేకుండా వచ్చిండు ఏం లాభం ఇలా అయితే”,
ఏం చేస్తాం రాజ్యం మన ఖర్మ, “ఏమండీ రేపు కార్తిక పౌర్ణమి కదా ?” మనం గుడికి వెళ్లి దేవుని కి అర్చన చేయిద్దాం,చిన్నోని మనసు మారుతుందేమో!”అని మాట్లాడుకుంటు ఉండగా ఇంతలో ఫోన్ మోగింది.
” హలో ఎవరు?” నేను చెల్లెమ్మ మీ సురేషం అన్నయ్యను”ఆ చెప్పండీ అన్నయ్య,ఆ ఏం లేదు, మా అల్లుడు వచ్చాడు కదా !నా కూతురు మయూరి చదువు పూర్తయింది మొన్ననే టీచర్ ఉద్యోగం వచ్చింది. మీకు తెలిసిన విషయమే కదా!చిన్ననాటి నుంచి మనం అనుకుంటున్నదే,మరేం లేదు చిన్నోడు నా అల్లుడేనని ఇప్పుడు అధికారికంగా అల్లున్ని చేసుకుందామని మేమంతా అనీకుంటున్నామ. రేపు కార్తీక పౌర్ణమి కదా.చాలా మంచిరోజు మీ వదిన నేను వస్తాము.
సరే అన్నయ్య మీ బావగారిని అడిగి చెపుతాను సరేనా…!”సరే చెల్లెమ్మ బావకు ఈ మాటలు చెవిలో వేయి మనం వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే కదా…!”అని ఆనందంగా ఫోన్ పెట్టేశాడు.
ఏమండీ మా అన్నావదినలు రేపు వస్తున్నారు.కార్తీక పౌర్ణమి కదా ! మా అన్నయ్యకు శివుడంటే చాలా ఇష్టం అందుకే ఆ రోజు లాంచనంగా మన చిన్నోడిని వాళ్ళ అల్లున్ని చేసుకోవడానికి వస్తారటా..!అని రాజ్యం చెప్పింది .కిరణ్ కి ఈ సంగతి చెపుదామని చూశారు కాని తను ఇంట్లో లేడు ,మరునాడు ఉదయం కిరణ్ రూం కెళ్ళి ఏరా !కిరణ్ రోజులాగే ఇవాళ కూడా ఇలా ఆలస్యంగా లేస్తావేంట్రా ఇవాళ కార్తీక పౌర్ణమి ప్రపంచంలో శివాలయాలన్ని భక్తులతో నిండి పోయి ఉంటాయి కాస్తా తల స్నానం చేసి గుడికి వెళ్ళరా…?
ఏందమ్మా నువు,నేనేమైనా ముసలాడినా గుళ్ళు గోపురాలు తిరగడానికి: ఒరేయ్ మా అన్నవదినలు ఈ రోజు అర్థరాత్రి గంటలకు మన ఊరి శివాలయంలో శివలింగం మీద ఉమ్మెత్త పూవు వేయడానికి వస్తారు.ఎందుకంటే ఆ పరమేశ్వరుని కృప పొందాలని వారి నమ్మకం రా…
అవేం సాంప్రదాయాలు అమ్మా! నేను వెళ్ళను, అదేంట్రా ? మీ నాన్న కూడా వెళదాం అంటే రాత్రి చన్నీటి స్నానం అనారోగ్యం అని నేనే వద్దు అన్నాను.నీ చదువు పూర్తి చేసుకొని వస్తే లక్షదీపారాధనా చేస్తానని మొక్కుకున్నాను రారా వెళదాం!
నువ్వే మొక్కుకున్నావు కదా !వెళ్ళు నేను రాను”సరే రాకు గాని మీ మామయ్య వస్తాడంటా లేచి తయారై ఉండురా! అని చెప్పిన రడీ కాలేదు కిరణ్.నిద్రమత్తులోనే మాట్లాడుతున్నాడు.
ఎందుకమ్మా చిన్న మామయ్య వస్తున్నారు ఏమైనా విశేషమా?
“ఏం లేదురా మొన్న మయూరి కి ఉద్యోగం వచ్చింది కదా !అందుకే నీ నోరు తీపి చేద్దామని అన్నదటా వస్తున్నారు.” ఓహో…సరే అమ్మా తయారు అయి ఉంటాను.
ఏమే రాజ్యం పిల్లనివ్వడానికని చెపితే ఏమౌతుండేది.”అది కాదండి అలా చెపితే వీడు సిద్ధంగా ఉండడు అందుకే ఇట్లా చెప్పానండి”
ఇంతలోనే కారు ఆగిన శబ్దమైంది .ఇంటి ముందు పచ్చని నానో కారు ఆగింది, గేటు దగ్గరకు వెళ్ళి చూడరా పెద్దోడా,అమ్మా …!చిన్న అత్తమ్మ,మామయ్య మీ చిన్న కోడలు మయూరి వచ్చారు అని చెప్పంగానే,
రాజ్యం వంటగది లో నుండి పరుగుపరుగున రోడు మీదకు రాసాగింది,ఆమే వెనక రంగనాథం వస్తున్నాడు.కిరణ్ బాత్రూమ్ లోంచి తొంగి చూస్తాడు ఒక కంటితో ,వాళ్ళు వస్తూ వస్తూ ముచ్చటిస్తున్నారు ఏం అల్లుడు బాగున్నావా ? “అవును మామయ్య”
పెద్ద బావా నన్ను దీవించండి,మొన్ననే టీచర్ గా నియమింప పడ్డాను కదా! “నేనేం దీవించాలి ఇన్ని రోజులు మరదలువి ఇపుడు టీచరమ్మ వి కదా!నీకు నాకు పోటితత్వం ఉంటుంది”
చీ……బావా?అవేం మాటలు బావా ?అలా అంటారు,అలా అనాల్సింది మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇంకా బయటకు రాలేదేం?సర్లేగాని పుట్టిన అప్పటినుంచి మీ మరదలును పంతులమ్మను అయింది మొన్ననే కదా! ముందు నుంచి ఉన్న బంధమే ఉండాలి.
అది కాదు మరదలు పిల్లా !ముందు వచ్చిన చెవులకన్నా వెనక వచ్చిన కొమ్ములే వాడిగా ఉంటాయి కదా!”కాని చెవులు వంచితే వంగుతాయి కొమ్మలు విరిగిపోతాయి కదా! పెద్ద బావ”అబ్బో మరదలు పిల్లా బాగానే మాటలు నేర్చింది అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. హాల్లోకి వచ్చి అందరూ కూర్చున్నారు.
చెల్లెమ్మా ఏంచేస్తున్నావ్ … “ఏం చేస్తుంది లెండి మీ చెల్లెలు అన్నావదినలు వచ్చారు ఎన్ని రోజులు ఉంటారోనని బెంగపడి వంటింట్లో దాక్కుంది కాబోలు..” అవేం మాటలండీ సరసాలాడడానికి వేళాపాళా లేదా ఏంటి?
చూడు వదినా మా కోడలు మా ఇంటికి వచ్చింది కదా నోరు తీపి చేద్దామని గులాబ్ జామూన్ చేస్తున్నా ఇంతలో మీరు వచ్చారు చాలా సంతోషం. ప్రొద్దున్నే జమదగ్ని తో పుల్లారెడ్డి స్వీట్లు తెప్పించాను కాని మమకారం తో చేసిన ఈ స్వీటుతో మనబంధం నిలిచి పోవాలని అనుకుంటున్నాను అని వదినా మరదళ్ళు గుసగుస లాడుకుంటున్నారు.
అత్తయ్య మామయ్య నన్ను దీవించండి అని పాదాలపై తలవాల్చింది. మయూరి ని శీఘ్రమేవకళ్యాన ప్రాప్తిరస్తూ అంటూ దీవించారు.
వెంటనే లేచి ఎక్కడో నా మొగుడు గారు,వారు స్నానానికి వెళ్ళారని చెప్పారు, ఓహో మొగుడు గారికి అమెరికా అలవాట్లు పోలేదు కావచ్చు బావా నేను ఇంటికి రానివ్వు అన్ని పోగొడుతాను అని ధైర్యంగా చెప్పింది.
రంగనాథం ను వియ్యంకుడు, బావా కుషలమా !ఆరోగ్యం ఎలా ఉంది.”ఏదో మీ చెల్లెల్లు పుణ్యమా అని పత్యపు తిండి పెడుతుంటే ఇలా ఉన్నాను.” మయూరి కల్పించుకొని మీకేం బెంగ లేదు మామయ్య నేను వచ్చాకా చిన్న పిల్లాడిలా చూసుకుంటా సరేనా….!
ఇంతలో కిరణ్ స్నానానికి వెళ్ళి వస్తూ మామయ్య అంత బాగేనా అని కుశల ప్రశ్నలు అడిగాడు. అత్తయ్య మరియు మయూరి ని కూడా అడిగి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళి పోయాడు కిరణ్.
వియ్యంకుడు మెళ్ళిగా బావా చిన్ననాటి నుంచి అనుకుంటున్న విషయమే కదా ! మా మయూరి ని కిరణ్ కి ఇచ్చి పెళ్ళి చేద్దాం ఏమంటారు,
” వియ్యంకురాలు ఏభనేది ఏంటండీ అల్లుడు మనవాడే కదా.! ”
సరేకాని చెల్లెమ్మ చదువు పూర్తి అయింది ఇంకా ఏ కొలువు దొరకలేదు,ఇంకో రెండేళ్ళ తర్వాత గాని పెళ్ళి చేసుకోడంటా!
దానిదేముంది అన్నయ్య మీ కోడలుకు ఉద్యోగం ఉంది,మీకు మాకు ఆస్తికి ఏ లోటు లేదు కదా!ఆడపిల్లకు వయసు రాగానే పెళ్ళి చేస్తే మంచిది మాకు బరువు బాధ్యత తీరుతుంది పెళ్ళి చేద్దామన్నయ్యా”ఇంతలో చాలా ముస్తాబై యువరాజు లా వచ్చాడు.
“ఏంటీ మామయ్య మరిది గారిని అడిగేదేంటీ” అని ఇంటి పెద్ద కోడలు తన మనసులోని మాటను వెల్లడిస్తుంది.కిరణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతాడు.ఏం మాట్లాడుతున్నారు వదినా ? “ఏం లేదు నీఃఉ కాబోయే పెళ్ళాం గురించే.చూడు వచ్చిన అరవై నిమిషాలలోనే అందరితో కలిసిపోయింది.” కిరణ్ ఆలోచిస్తూ మయూరి నాకు పెళ్ళాం ఏంటీ నేను తనను చేసుకోను.
“అవేం మాటలు అల్లుడు మీ పైనా ఆశలు పెంచుకున్నాం కదా!”
ఎవరు పెంచుకొమ్మన్నారు
సరే చిన్నప్పడు పెళ్ళి చేసుకుంటాను అన్నావు కదా!మరి ఇప్పుడు ఇలా మాట్లడతావేం”అంటే అప్పుడు తను అందంగా ఉండెది ఇప్పుడు నచ్చట్లేదు అంతే”. నేనంటే ఎందుకు నచ్చట్లేదో చెప్పాలి అని ఆవేశంతో మయూరి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళ నుండి రాలిపడుతున్న నీళ్ళను తుడుచుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది.
“సరే అల్లుడు ఇది సరైన కారణం కాదని మాకు అర్థమైంది. పై చదువులకు విదేశాలకు వెళ్ళి అక్కడి నీచమైన సంస్కృతిని అలవర్చుకున్నావేమో?అయినా మయూరి నీకు నచ్చలేదంటే నీ మనసులో ఎవరో అమ్మాయి ఉందని తెలుస్తుంది.మాకు చెప్పకపోయినా మీ అమ్మానాన్నల కైనా చెప్పు. ఇంతటితో మన బంధం తెగినట్లే అని సురేషం ఏడుపు మొహం తో చెల్లెల్ని చూస్తూ మీ మనసు కుదుట పడ్డాక మళ్ళీ వస్తాం”
చూడు మామయ్య మళ్ళీ రండి! మీ చెల్లెల్ని చూడడానికి మాత్రమే అంతేగాని సంబంధం మాట్లాడడానికి కాదు.”అవేం మాటలురా,అన్నయ్య వాడు చిన్నవాడు మీరేం పట్టించుకోకండి వదినా మన ఖర్మ కాకపోతే ఇదేంటి ?అని సురేషం బాధ పడుతు కార్లోఎక్కి వెళ్లి పోయాడు.
ఏంటండీ అల్లడు అలా మాట్లాడుతున్నాడు మన అమ్మాయి పరిస్థితి ఏంటి,”మా బావ వద్దంటే వినకుండా పెద్దచదువని అమెరికా పంపించాడు,అక్కడి సంస్కృతి కి అలా తయారయ్యాడు. పోనిలే ఇన్నాళ్లు ఆశపడ్డందుకు తగినశాస్తి జరిగింది. ఇక ఆ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం మానుకొండి అని చిరునవ్వుతో సురేషం హెచ్చరించాడు ఇన్నాళ్ళున్నా బంధాలన్నీ ఆవిరై పోయాయి”.
మరునాడు కిరణ్ నాంపల్లి స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ నిలుచుని ఉన్న కీర్తిని చూసి మెల్లిగా మాటలు కలిపాడు.
హాయ్,మీ పేరు?” నా పేరు కీర్తి.” ఓ థ్యాంక్స్, నేను కిరణ్ మాది పక్కవీధి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. ” ఓ అవునా..!నేను స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నా”.
అంతలో రైలు వచ్చి వెళ్ళిపోయారు,మరుసటి రోజు కూడా వాళ్లు అక్కడే అలాగే కలుస్తు ఉండేవారు. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిపోయి ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు తీసుకున్నారు.కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రేమికులుగా మారిపోయారు,ప్రేమ బీజాలు వారి మనసుల్లో చిగురిస్తూనే ఉన్నాయి రోజూ లాగే ఆ రోజు కూడా వెళ్ళారు కానీ అక్కడ తన మామ కూతురు మయూరి ఉంది.వీళ్ళిద్దరూ పక్కపక్కనే పంతులమ్మలు.
మయూరి,అతను చాలా అందంగా ఉన్నడే తనను ప్రేమిస్తున్నా,”తన పేరేంటీ” ఏమో తెలియదు,”పేరు తెలియకుండానే ప్రేమించేంత పిచ్చి దానివానే నువ్వు, గుర్తుంచుకో తను ఎవరో ఏ కులమో తెలియకుండా అలాంటి పనులు చేయకు”. మయూరి నువు అలా మాట్లాడకే అతను నీకు తెలుసా…?” అవును తను మా మేనత్త కొడుకు కిరణ్ మొన్ననే అమెరికా నుంచి వచ్చాడు. చిన్ననాటి నుంచి నన్ను చేసుకుంటానన్నాడు ఈ మధ్య మా నాన్న గారు మేము వెళ్లి మాట్లాడితే వీలు కాదు అన్నాడు, అందుకే వదిలేసాం తను మా బావా అని కాదు గాని అప్పుడు మంచివాడే అమెరికా నుండి వచ్చాక వింతగా ప్రవర్తిస్తున్నాడు”.
చూడే మయూరి నీ సలహా మాత్రమే అడిగాను అంతే,అతని గురించి నాకు చాలా తెలుసు తననే పెళ్ళి చేసుకుంటా ఇంకేం చెప్పకు.
“నీ ఖర్మ నేనేం చెబుతాను” దీనికి ప్రేమపిచ్చి కాస్త ముదిరిపోయింది.ప్రేమ గుడ్డిదని అందుకే అంటారు అని మనసులో అనుకుంటూ మయూరి కీర్తి తో “పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది” సంధ్యాసమయం కావడంతో అందరు ఇంటికి వెళ్ళిపోయారు.కీర్తి చాలా సంతోషంగా ఇల్లు చేరింది.
ప్రతిరోజూ కీర్తి అన్ని విషయాలు వాళ్ళనాన్నతో పంచుకుంటుంది ఈ రోజు కూడా జరిగిన విషయాల్ని ఆనందంగా పంచుకుంది. మధ్యలో వాళ్ళ అమ్మ కలుగ చేసుకొని ప్రేమలు గీమలు వద్దు అని చెప్పింది.అయినా వినకుండా కీర్తి తన మనసులోని మాటల్ని చెప్పడంతో నాన్న అంగీకరించాడు.అమ్మ మాత్రం వద్దని వారించింది.మా పరువు తీసే పని చేయకని మందలించింది.
అమ్మా నేనేం మీ పరువు తీయను కిరణ్ ని పెళ్ళి చేసుకుంటాను లేకుంటే రైలు కిందపడి చనిపోతాను.”ఏం బెదిరిస్తున్నావా చచ్చి పో పీడ విరగడైతది” అని వాళ్ళ అన్నయ్య అన్నాడు.వెంటనే కీర్తి ఏంటన్నయ్యా ఉద్యోగం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు కదా!ఇపుడు మా ఇద్దరికి ఉద్యోగాలున్నాయి అతనిది వేరే కులమైనా అతడే నా భర్త అని చెప్పింది.
కొన్నాళ్ళ తర్వాత గుడిలో కీర్తి పెళ్ళి అమ్మానాన్నల ఆధ్వర్యంలో జరిగింది. కీర్తి ప్రేమించిన కిరణ్ తో పెళ్ళి అవడంతో గర్వపడింది కాని అత్తారింటికి వెళ్ళగానే వాళ్ళు వెలివేశారు.చేతిలో చిల్లిగవ్వ లేకుండా బయటకు వచ్చి కష్టాలు పడుతూ బ్రతుకు బండిని పది సంవత్సరాలు మోసింది.కాని కిరణ్ జల్సాలు, క్లబ్బులు, ఫబ్బులు,బార్లలో కాలం గడిపే వాడు.వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పదకొండవ సంవత్సరం లో భగవంతుని అనుగ్రహముతో ఓ కంపెనిలో సాఫ్టువేరు ఉద్యోగం దొరకడం తో హాయిగా జీవితం గడుపుతున్నారు. కీర్తి ప్రార్థనలు దేవుడు విని తన దుఃఖాన్ని పూర్తిగా తొలగించాడు.రోజుకో విధంగా వారికి లాభం జరుగుతూనే ఉంది.
*చిలకమారి తిరుపతి*
*స్వరమయూరి*
*చెన్నూర్*
*9640908491*