అక్షర సారథి . అంబటి నారాయణ

నిర్మల్

అక్షర సారధి.. ”

గురువు…
పాదాలను పూజించాలి
అతడు మనకు ఓ బోధివృక్షం!!…
అక్షరాలతో మనల్ని…
విస్తరింప జేస్తాడు!!…
విజ్ఞానసౌధం వైపు…
నడిపిస్తాడు!!…
అక్షరాలదారుల్లో…
అనంతభావాన్ని చూపించి…
తడి ఆరిన ఎడారి గుండెలని
సరికొత్త భావంతో…
స్పృశించేలా చేస్తాడు!!

గురువే మనకు ఓ ఇతిహాసం!!…
ప్రకృతి పుస్తకాన్ని తెరిపించి…
పసందైన పదాలకు
పదును పెట్టించి…
అదును చూసి మనలోని
అజ్ఞానాన్ని తరిమేస్తాడు!!….

తరతరాల చరిత్రలో
తరగని గుణాలనెన్నో చూపిస్తాడు!!…
లోకంపోకడను
తనకళ్ళతో చూపించి…
మనసుతో ముడివేసి…
మమతలవడిలో కూర్చోబెట్టి…
సంస్కార గుణవంతునిగా…
తీర్చిదిద్దగలడు!!…

కనికట్టుతో కట్టేసి
కనువిందుచేసే ఎన్నో
దృశ్యాలను చూయించి…
అక్షరాలతో మనసుకు విందుచేసి…
వింతలోకాల్లో…
అక్షరపుంతల్ని తొక్కించేలా చేస్తాడు!!…

ప్రపంచపు వింతల్ని…
మానవీయ విలువల్ని…
సమానత్వపు వెలుగుల్ని…
ఆచరించి చూపాడు!!…
అందుకే… అతడొక
విజ్ఞాన కాంతి పుంజం!!…
మనలో నిలిచిన ఓ క్రాంతి దీపం!!…

అక్షరం మొలకెత్తే
విధానం చూపాడు!!…
మన గుండెలో చొరబడి
సత్యాన్ని దర్శించే
వినూత్న దృష్టిని అలవరచగలడు!!…
వెన్నెల జలతారులో…
పారే సెలయేరులను..
దర్శించేలా చేస్తాడు!!….

ఎన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించి..
సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనాడు!!..
ప్రతినిత్యం ఓ అద్భుత
కృత్యం ఆవిష్కరిస్తాడు!!…

గురువు చూపిన
గమ్యం సుసంపన్నం!!…
మనలోని చెడుశక్తులను
పట్టేసి కట్టేసి దూరంగా నెట్టేస్తాడు!!…
బతుకు ఏడారిని ఓ పచ్చని
మాగాణిగా మార్చేస్తాడు!!…

స్వేదం చిందించకుండా…
రుధిరం పొంగించకుండా…
సునాయాసంగా అక్షరాకృతిని
పటిష్టమైన జాగృతిగా మలిచగలడు!!…
ఎన్నోతప్పిదాలను తిప్పికొట్టి…
తప్పటడుగులను సరిచేసి…
కలిసొచ్చిన కాలానికి
నడిచొచ్చిన గురువుగా…
మన అంతరంగాన…
ఓ ఆరాధ్యదైవంగా నిలిచి పొగలడు!!…

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Get real time updates directly on you device, subscribe now.