గురువుకు వందనం.. గాజుల నరసింహ

కవి

శీర్షిక :-గురువుకు వందనం
పేరు :-గాజుల నరసింహ
ఊరు :-నాగటూరు గ్రామం, నంద్యాల జిల్లా
9177071129

గురువుకు వందనం
అతని ఔనత్యానికి పాదాభి వందనం
జ్ఞానరస సాగరం విద్యా సంపద శిఖరం గురువు
విద్యార్థుల ప్రగతి బాటలను బంగారు
బాటలుగా మలిచే మహా శిల్పి గురువు
విద్యార్థుల మాస్టిష్కలో జ్ఞాన జ్యోతిని వెలిగించి
చీకటి పొరలను సైతం తొలింగిoచే ప్రజ్ఞాశాలి గురువు
అందుకే చేయాలి గురువుకు వందనాలు
అతని ఔనత్యానికి పాదాభి వనందనాలు
ఎన్నో సమస్యలను పరిష్కరించే జ్ఞాని
ఈ జగతిలో గురువు పూజనీయుడై వెలుగొందే సూరుడు
సుమగoధాల సాటి పరిమళిoచే పవిత్ర మూర్తి గురువు
అందుకే చేయాలి గురువుకు వoదనం
అతని ఔనత్యానికి పాదాభి వoదనం
త్రీమూర్థుల అంశమై సరస్వతీ పుత్రుడై ఈ లోకానికి వరమై
అతిధిగా వచ్చిన మహనీయుడు గురువు
సంస్కార పాఠాలు నేర్పించి వినయo విధేయుoను అలవరిచి విద్యార్థులను
ఓ తాటిపై నడిపించే మహా సైనికిడు గురువు
దిన దినము విద్యార్థుల ప్రజ్ఞశాలిని పరిశీలిస్తూ వారి పరంపరల
కార్యశీలతలో తప్పోప్పులను ప్రక్షాళన గావించి
విద్యార్థి యొక్క జీవనతిని సస్యాశామలo చేసే నిత్య శ్రామికుడు గురువు
అందుకే చేయాలి గురువుకు వందనo
అతని ఔనత్యానికి పాదాభి వందనo

గాజుల నరసింహ
నాగటూరు గ్రామం
నంద్యాల జిల్లా
9177071129

హామీపత్రం :- ఇది నా సొంత రచన అని తెలుపుతున్నాను

Get real time updates directly on you device, subscribe now.