శశి శర్మ బొల్లాప్రగడ

కందం

#శశి_శర్మ_బొల్లాప్రగడ #కందము

కం:
అయగారికసలు చదువే
మియు రాదిక వేష మేమొ మిట మిట మన్ వి
స్మయ మౌను ” పటాటోప
భయంకర ” యటన్న సరణి బరగును నరుడా !!

కం:
పలు పలుకు లేలరా ? ని
ర్మల మతి నూహించ ” దనకు మాలిన ధర్మం
బిల గలదె ?” దినము గడచుటె
తల పట్టుట , లేరుగ నట్టిదా ? మరి నరుడా !!

కం:
నలుగురు నడచెడి దారినె
మెలగుట , కడు లెస్స యొంటి మెలగిన ఫలము
ల్గలుగవు ” సంఘే శక్తిః
కలౌ యుగే ” యనెడి సూక్తి గట్టిది నరుడా !!

కం:
పని పాట లేక యూరక
తిని దిరిగెడి నాప చెంత దిరిగెడి వారిన్
జెనకుడు దాజెడు కోతియు
వన మెల్లంజెరచు నట్టి పట్టుగ నరుడా !!

కం:
మతి మంతుడైన యాతడు
ధృతి మన్మని యౌచు ” మాతృ దేవోభవ ” యన్
వ్రతము ” సమాతుః పరదై
వత ” మని ఎడినుడి నెరింగి వర్థిలు నరుడా!!

శశి శర్మ బొల్లాప్రగడ
విశాఖపట్నం
12-09-2022 .

Get real time updates directly on you device, subscribe now.