చెట్టు జగతికి జీవనసారం

చెట్టు జగతికి జీవనసారం

సమ దర్శిని . com
అంశం :-:- చిత్ర కవిత
తేదీ :-13-9-22
పేరు :- గాజుల నరసింహ
శీర్షిక :-చెట్టు జగతికి జీవనసారం
ప్రక్రియ :- గేయం

కల్మషాలు అంటని తరువు
కరుణ నిండిన తరువు
పరులకోసమే తన జన్మ అంటూ
పలుకుతుంది ఈ చిత్రం చూడరా..2

నవమాసాలు మోస్తుంది ఒక స్త్రీ మూర్తి
తను ఉన్ననాళ్ళు మోస్తుంది ఈ మూర్తి
పరుల హితమే కోరుట నా కర్తవ్యం అంటుంది
లోక కళ్యాణo కొరకే నా జన్మ అంటూ
చెట్టు ఈ జగతికి జవానుగా ఉంటుంది
దైవం సాటిగా పూజింపబడుతుంది ||

ఇట్టి ఉపయోగం లేని జన్మలు ఎందుకురా మనకు ఇలలోన
ఆ తరువును చూసి సిగ్గుపడాలి ఈ మానవ జన్మ 2
ఇంటికి వాసం అవుతుంది ఒంటికి వైద్యం అవుతుంది
మండుటెండలో గొడుగై నీడనిస్తుంది
అలసిన వేళ చెంతచేరి సేద తీర్చుకోమంటుంది స్నేహితుడిలా ఉంటుంది అమ్మలా ఓదార్పు నిస్తుంది
తరువే లేని తరుణం కాదా.. బతుకే దారుణం ||

శుభాలకు పచ్చని పందిరి అవుతుంది
కాలం తీరితే…2దేహానికి పాడే అవుతుంది
కాస్థానికి కాలే కట్టే అవుతుంది
తెలుసుకో.. మనిషి తెలుసుకో..
ఆ చెట్టును నువ్వు నరికేస్తే నిన్ను నీవు నరుకున్నట్టే
నీరు పోసి పెంచ్చావంటే…2 ఒక జీవికి ప్రాణం పోసినట్టే
భవితరాలకు నువ్వు ఓ ఉపకారం చేసినట్టే
చెట్టేరా ప్రగతికి మూలo ఆ చెట్టేరా..ఈ జగతికి జీవనసారం
తెలుసుకో తెలుసుకో.. ఓ మనిషి తెలుసుకో…

గాజుల నరసింహ
నాగటూరు గ్రామం
నంద్యాల జిల్లా
9177071129

హామీపత్రం :- ఇది నా సొంత రచన అని తెలుపుతున్నాను

Get real time updates directly on you device, subscribe now.