*బాల సాహిత్యంలో.. ఆకుపచ్చని సంతకాలు… రాథోడ్ శ్రావణ్ రచయిత ఉపన్యాసకులు*
2013 లో స్థాపించబడిన ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో సాహితీ రంగంలో కృషి చేస్తూ సాహితీ వనంలో పరుగులు తీస్తోంది. తొలి సారిగా 2014 తెలుగు సాహిత్యంలో ఓనమాలు నేర్చుకున్న కవులు, కవయిత్రుల చే “ఉట్నూరు కవిత” సంకలనాన్ని వెలువరించింది.సాహితీ వేదికకు పునాదులు వేసిన ముఖ్య కవులతో పాటు చిన్ని, చిన్ని కవితలు, రచనలు రాసే కవులకు తొలి సారిగా ఈ పుస్తకంలో అవకాశం లభించింది. ఉట్నూరు సాహితీ వేదికకు సాహితీ సమాజంలో ఊహించని రీతిలో ఆదరణ లభిస్తోంది. 2015 లో “ఉట్నూరు సాహితీ సంచిక”,2017లో ఉట్నూరు సాహితీ కెరటాలు, 2020లో విద్య కుసుమాలు ఇలా మొత్తం 30 పుస్తకాలు ఇప్పటికే ఆవిష్కరించింది.
ఉట్నూరు సాహితీ వేదిక ద్వారా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 నవంబర్ 2021లో బాలకవులచే కవిత్వ పరిమళాలు ( ఉట్నూరు విద్యార్థుల కవితలు) అనే పుస్తకాన్న ఆవిష్కరించింది.
ప్రతి సంవత్సరం నవంబర్ 14 న చేపట్టబడుతూన్న పుస్తక ఆవిష్కరణ మహోత్సవం ఒక *సరస్వతీ పుత్రుల జ్ఞాన యజ్ఞంలా కోనసాగుతుంది.ఇది చాలా మహోన్నతమైనది మరియు ఉత్కృష్టమైనదని చెప్పవచ్చు.* ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ఉట్నూరు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన మొత్తం 130 మంది బాలకవులచే *ఆకుపచ్చని సంతకాలు*
శీర్షికతో సంకలనాన్ని ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువరించడం గొప్ప విషయం. ఈ పుస్తక యజ్ఞంలో అడవి తల్లి అందాలు, పుడమి పరిమళం, జీవ వైవిధ్యం, పల్లె ప్రకృతి, పచ్చని బహుమతి, వనం, మనకోసం,అడవుల ఉపయేగాలు మొదలైన అనేక అంశాలను పుస్తకంలో చేర్చడం వలన పుస్తకానికి నిండుదనం వచ్చింది. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి యువ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా న్యూఢిల్లీ సహయ సంపాదకులు గౌరవ శ్రీ డాక్టర్ పత్తి పాక మోహన్ గారు మొందు మాట రాయడం విశేషం.
ఉట్నూరు సాహితీ వేదిక బాలకవులలో రచనా శక్తిని పెంచుతు అధ్యక్షులు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్, ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్, ప్రచార కార్యదర్శి ఆత్రం మోతిరామ్
ఎంతో సేవా భావంతో శ్రమకోర్చి చక్కటి పుస్తకాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రియమైన బాలకవులారా ! మీరు అడవి తల్లికి సంబంధించిన అనేక కవితలు రాశారు. మిమ్మల్ని ప్రస్తుతం ఎవ్వరూ గుర్తించకపోవచ్చు.కానీ ఒక మంచి కవులుగా,రచయితలుగా, రచయిత్రులుగా గుర్తించే రోజులు దగ్గరలోనే ఉంది.మీరు చిన్ని చిన్ని కవితలు, గేయాలు,కథలు రాసుకుంటూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు గొప్ప కవులు కాబోయే రోజులు దగ్గరపడుతుంది.
మీరందరికి మీ తల్లిదండ్రుల, గురువుల, చదువులతల్లి సరస్వతి దేవి దీవెనలు కలగాలని, మీ
భవిష్యత్తు మహోన్నతంగా ఉండాలని, భవిష్యత్తులో గొప్ప కవులు, రచయితలు, రచయిత్రులు కావాలని ఆకాంక్షిస్తూ, ప్రతి బాలకవి పై సరస్వతీ మాతా కృపా కటాక్షం ఉండాలని కోరుతూ….. అడవి గొప్పతనాన్ని చాలా చక్కగా వివరిస్తూ, సందేశాత్మకమైన
కవితలు, నినాదాలు, సరళంగా,సుందరంగా ముగ్ధమనోహరంగా రచించిన చిన్నారులను మనసారా అభినందిస్తున్నాను.
వెల:-150/-
పుటలు:-144
ప్రతులకు :-
ముంజం జ్ఞానేశ్వర్
ఉట్నూరు సాహితీ వేదిక భవన్ అగ్నిమాపక కేంద్రం దగ్గర
ఉట్నూరు ఆదిలాబాదు జిల్లా
చరవాణి సంఖ్య:-9963921217
పుస్తకసమీక్షలు:-( ఉపన్యాసకులు, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా)
*రాథోడ్ శ్రావణ్* *9491467715*