వేమన, సుమతి శతకాలలో మానవీయ విలువలు

వేమన, సుమతీ శతకాలు మానవ విలువలు:

బహుజన ప్రియమైన శతకాలలో ముఖ్యమైనవి వేమన, సుమతీ శతకాలు, వేమన తెలుగు ప్రజానీకానికి ఒక మహాయోగి, మానవతా మూర్తి జీవిత సత్యాన్వేషి తాను సమాజంలో దర్శించిన లోకరీతులను ఆటవెలదులలో ఆశువుగా లోకానికి అందించిన మహానుభావుడు. ఆయన గొప్ప సాధకుడు, బోధకుడు. ద్రష్ట స్రష్ట మహాకవి. ప్రజాకవి. ఆయన అనుభవసారమే ఈ శతక పద్యాలు, వేమన పద్యాలన్నీ బాలల వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే ఆణిముత్యాలు. మానవ విలువలు ఎన్నింటికో ఆలవాలము వేమన శతకం.

సుమతీ శతకకారుడు బద్దెన క్రీ.శ. 1260 కాలానికి చెందినవాడు. కంద పద్యాలలో సమతీ శతకాన్ని రచించారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జాతి జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. ఈ శతక పద్యాల పాదాలు సామెతలుగా, జాతీయాలుగా జనుల నాల్కలమీద నిలిచిపోయాయి. సుమారు ఏడువందల ఏళ్ళ క్రితం రాయబడినా దాదాపు అన్ని పదాలు ఇప్పటి భాషలో వాడుకలో ఉన్నాయి. కష్టపడకుండానే గుర్తుపెట్టుకునే శక్తి ఈ పద్యాలకుంది, వాటిని కూర్చిన శైలిలో ఉంది. అందుకే పామరులు కూడా ఈ పద్యపాదాలను తమ వ్యవహారంలో ఉదహరిస్తుంటారు. ఈ. శతక పద్యాలు ఆకారాది క్రమంలో ఉండి తరువాతి కవులకు ఆదర్శప్రాయమయ్యాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, క్లుప్తంగా చెప్పిన పద్ధతి అద్భుతంగా ఉంటుంది.

మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణము సుభటకోటి ధరిత్రిన్ టికి బ్రాణము మానము విశ్వదాభిరామ వినుర వేమ!

అల్పుడెపుడు పల్కు నాదంబరముగాను సమందు పల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు తనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినుర వేమ!

నేరసన్నవారు రణ మహిలోన నేరనన్నవాడు నిందతెందు ఊరుకున్నవాడే యుత్తమ యోగిదా!. విశ్వదాభిరాను వినుర వేముకు

ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధమ్యడు సుమతీ!

ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు కాచి యతకడమ్మ క్రమముగాను మనసు విరిగినేని మరియంటనేర్చునా విశ్వదాభిరాను. వినుర వేము

ఈ పద్యాలు మానవ జీవితంలో వాక్కు ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. చురుకైన నాలుక పదునైన కత్తిలాంటిది. మాటలు గాల్లో కలిసిపోవు. ఎదుటివారి గుండెల్లో బాకులై, శూలాలై గుచ్చుకుంటాయి. స్నేహాలు సెలవంటూ వీడిపోతాయి. రక్త సంబంధాలు తేలిపోతాయి. కాబట్టి ఆలోచించి మాట్లాడాలి మూర్ఖుడు మాట్లా ఆలోచిస్తాడు. తెలివైనవాడు ఆలోచించి. మాట్లాడతాడు. మాట్లాడి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. మన మాటలో పత్యం ఉన్నప్పుడు, మన స్వరంలో స్పష్టత వస్తుంది. దానికి గాంధీర్యం తోడవుతుంది. తెలియదని చెప్పి తప్పించుకొనువాడు తెలివిగలవాడు. అన్నీ తెలుసువన్నవాడు. నిండల పాలవుతాడు. ఆ విధంగా చెప్పకుండా నిగ్రహంతో మౌనంగా ఉండే వాడే బుద్ధిమంతుడు అనవసరంగా మాట్లాడకుండా నిగ్రహంతో మౌనం వహించడం గొప్ప విషయం మౌనం అనగా నోరుమూసుకొని ఉండడం కాదు. మాట్లాడవలసిన అవకాశం వచ్చినా మాట్లాడకుండా నిగ్రహం వహించడమే మౌనం అవుతుంది. కా

చంపదగిన యట్టి శత్రువు తన చేత జిక్కెనేని కీదు సేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరాను వినుర వేమ!

జీవి జీవి జంపి జీవిక వేయగా జీవి వలస నేవి జిక్కియుండె జీవ హింసకులకు జిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినుర వేమ!

‘అహింస పరమోధర్మ:’ ధర్మాలన్నింటి కంటే అహింస గొప్ప ధర్మం. ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టంలేని పనిని బలవంతంగా చేయించి తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మల చేత బాధ కలిగించడం హింస. సర్వకాల సర్వావస్థలలో ఇతర ప్రాణులకు ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస, హింస మూడు రకాలు, మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస, పరులకు హాని తలపెట్టడడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస, అసత్యాన్ని పలకడం, పరుషంగా మాట్లాడడం వాచిక హింస. ఒక జీవిని చంపడం, గాయపర్చడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీల సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి. అహింసా ప్రవృత్తి వల్ల మనిషికి ఆత్మబలం చేకూరుతుంది.

కోపమునను ఘనత కొంచమైపోవును కోపమునను మిగుల గోడుగలు కోప మడిచెనేని కోర్కె లీడేరు విశ్వదాభిరామ వినుర వేమ!

తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు, తథ్యము సుమతీ!

కోపం ప్రకృతి పరమైన సహజ ఉద్వేగం. ఇది జీవుల శరీర భౌతిక ధర్మం. జీవులు తమ మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం. ఇతర జీవుల వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మనుగడలో పోటీ వచ్చినప్పుడు ఆ స్థితి జీవికి సవాలుగా మారుతుంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి జీవులు భయాన్ని లేదా కోపాన్ని ప్రదర్శిస్తాయి. మానవుడు పుట్టుకతో వచ్చే సహజ ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచే ఓర్పును

తప్పులెన్నువారు తండోప తండంబు లుర్విజనులకెల్ల నుందు తప్పు తప్పులెన్ను వారు తమతప్పు లెరుగరు విశ్వదాభిరామ వినుర వేను!

ఈ కనులే ఒక తప్పు చేస్తూనే ఉంటాదు. తప్పు చేయడం తప్పుకాదు. పనిచేడేవాడే తప్పులు చేస్తాడు.
అందుకే అంటారు.’ఏ తప్పు చేయని వాణ్ణి నాకు చూపిస్తే, ఏ పని చేయనివాణ్ణి నీకు చూపిస్తా’ అని. తప్పులను సరిదిద్దుకుంటూ మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేవాడు ఉన్నతిని సాధిస్తాడు. ఆత్మపరిశీలన ద్వారా తన తప్పులను మనిషి తెలుసుకోగలడు, ప్రతిరోజా కొంత సమయం ఆత్మపరిశీలనకు కేటాయిస్తే ప్రవర్తనలో మార్పు సాధించగలుగుతారు. సామాన్యుడైన గాంధీ ఆత్మపరిశీలన ద్వారానే మహాత్ముడయ్యాడు. తెలియక చేసిన తప్పులను నిజాయితీగా ఒప్పుకోవడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం. తప్పును ఒప్పుకోవడం ద్వారా ఒక చెడ్డ విషయాన్ని ఒక మంచి విషయంగా మార్చినవారమవుతాము తప్పుల్ని గుణపాఠం నేర్పించే అనుభవాలుగా స్వీకరించాలి. ప్రతి తప్పు నుండి ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. అప్పుడే మెరుగైన వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది.

అనువుగాని చోట నధికులమనరాదు. కొంచెమైన నదియు గొదువగాదు. కొండ యద్దమందు గొంచెమై యుండదా విశ్వదాభిరామ వినుర వేమ!

ఎదిగినకొద్దీ ఒదిగి ఉండడం మనిషి వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. ఇతరుల ముందు తలవంచడమనేది దుర్బలత కాదు. ఒక గడ్డిపోచ ముందు కూడా తలవంచగలిగే ఔన్నత్యం మనిషి పెంపొందించుకోవాలి. ఎదుటి మనిషి తనపై ఊరికే కోపగించిన సమయంలో ‘ఇది నన్ను పరీక్షించడం కోసం భగవంతుడు ఏర్పరచిన లీల’ అని తెలుసుకొని కోపగించుకున్న వాడికి నమస్కరించే భావనను పెంపొందించుకోవాలి. అందుకు ఒదిగివుండడం అనే లక్షణం అవసరమవుతుంది.

ఆకొన్న కూడె యమృతము తాగొంకక నిచ్చువాడె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు తేరువగలవాడె వంశ తిలకుడు సుమతీ!

బాధలు, కష్టాలు, నష్టాలు మనిషిని ప్రయోజకునిగా చేస్తాయి. సామర్థ్యాన్నిస్తాయి. కష్టనష్టాలను ఓర్చువాడే మనిషి కష్టాలు, నష్టాలను మనిషి సవాళ్ళుగా భావించి ముందుకు సాగాలని కవి సూచించాడు. సమస్యలు ఎదురైనప్పుడు దాని తీవ్రతపై దృష్టిపెట్టి, బాధపడుతూ, నిరాశ నిస్పృహలకు గురికాకుండా, సమస్యల పరిష్కార మార్గంపై దృష్టి మరలించి ముందుకు సాగాలని కవి సూచించాడు.

ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెప మెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!

మానవుడు సంఘజీవి.. ప్రతి అవసరానికి సమాజంపై ఆధారపడతాడు. కాబట్టి ఇతరులకు కూడా ఉపకారం చేస్తూ తోడ్పాలు అందిచాలి.. మే చేసిన వారికి కీడు చేయడం, కూడు పెట్టిన వారిని కూలద్రోయడం, విద్య నేర్పినవారిని చెక్కిరించడం, ఉపకారం చేసినవారికి అపకారం తలపెట్టడం దుర్మార్గం, మూర్ఖత్వం, అనాగరికం అవుతుంది. అపకారం చేసే వాళ్ళకు ఉపకారం చేసేవాళ్ళు. అదుడుగా ఉంటారు. ప్రతి జీవిలోనూ భగవంతుని దర్శించేవారు, మానవసేవయే మాధవసేవగా భావించేవారు మాత్రమే అంతటి పరిక్వతను ప్రదర్శించగలుగుతారు. సకల శాస్త్రాల సారాన్ని క్లుప్తంగా చెప్పాల్సివచ్చినప్పుడు ‘పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్’ పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం తలపెట్టడమే పాపం అని చెప్పవచ్చు. విశాల దృక్పథంతో మెలగుతూ కీడు కలిగించిన వారికి కూడా మేలు చేయాలని బోధించాడు కవి.

కూరిమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు మఱి యా కూరిమి విరసందైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

ఏ నిధులున్నా, లేకున్నా స్నేహమనే పెన్నిధి ఉంటే అదే మహాభాగ్యం. స్నేహితం అనే పదంలోనే ‘హితం’ దాగుంది. సంతోషంలోనూ, సంతాపంలోనూ ఆత్మీయులుగా నిలిచేవారు స్నేహితులు ఎలాంటి భయాలు, సందేహాలు, సంశయాలు లేకుండా ఏ మనిషి ముందు మనం మాట్లాడగలమో. అతను లేదా ఆమె మన నిజమైన స్నేహితుడు. మనం ఎలా ఉన్నామో, అలా స్వీకరించడానికి మంచి స్నేహితుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలాంటి స్నేహాన్ని కాపాడుకోవాల్సిన అవశ్యకతను కవి వివరించాడు. మనుషుల మధ్య స్నేహం దూరమైనచో ఎదుటి వ్యక్తి ప్రతి చర్య తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి మనుషులు స్నేహభావాన్ని కలిగివుండాలని కవి చెప్పాడు.

వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

వినడం అంటే నేర్చుకోవడం. వినడం ఓ కళ. ఓ వ్యక్తి భావాలను, సంస్థల విధానాన్ని అర్ధం చేసుకునేందుకు, సమస్య తీవ్రతను గుర్తించేందుకు, పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు ఇలా విషయం ఏదైనా వినడం పరిష్కారం. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని ఓపిగ్గా వింటే చాలు తాను ఉన్నత గౌరవం పొందుతున్నానని, తాను మాట్లాడినదానికి అర్ధం ఉందని భావిస్తాడు ప్రతి మనిషి వినడం వలన చాలా ప్రయోజనాలున్నాయి. వినడం వలన నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్నేహసంపద పెరుగుతుంది. సమస్యలు ఎన్నో పరిష్కారమవుతాయి. వినడం వల్ల ఇతరుల సహకారం లభిస్తుంది. అయితే విని ఆలోచించి స్పందించాల్సి ఉంటుంది. ప్రేరణకు తక్షణ స్పందన జంతు లక్షణం.. ప్రేరణకు స్పందనకు మధ్యనున్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాడే ఉత్తముడు. విని ఆలోచించి స్పందిచడం గొప్ప మానవ విలువ.

ఈ విధంగా వేమన, సమతీ శతకాలలో మానవ జీవితానికి పనికి వచ్చే విలువలు ఎన్నో కన్పిస్తున్నాయి.

డాక్టర్ మాతంగి జానయ్య
తెలుగు అధ్యాపకులు
మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల,
నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.