నాటక సాహిత్యం


తెలంగాణలో నాటక సాహిత్యం లేదనే అభిప్రాయం తెలుగు సాహిత్య ప్రపంచంలో స్థిరపడిపోయింది. తెలంగాణలో నవల, కథ ప్రక్రియలు లేవనే అభిప్రాయమే బలంగా బలంగా ఉన్నప్పుడు నాటక సాహిత్యం గురించి అటువంటి అభిప్రాయం ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయితే బ్రిటిషాంధ్రలోని నాటకానికి ఉన్న చరిత్రకు ఏ మాత్రం తగ్గకుండా నైజామాంధ్రలోని నాటకానికి చరిత్ర ఉందనేది నిస్సందేహమైన అంశం. తెలంగాణ నుంచి సంస్కృత, తెలుగు నాటకాలు విరివిగా వెలువడ్డాయి. నాటక సమాజాలు కూడా పనిచేశాయి. నాటక ప్రదర్శనలూ ఉన్నాయి. యక్షగానాల చరిత్ర చాలా పెద్దది. తెలంగాణలో నాటక రచన రెండు మూడు వందల ఏళ్ల నుంచే ఉంది.

తెలంగాణలోని విదర్భ ప్రాంతంలో జన్మించిన భవభూతి మూడు నాటకాలను రచించిడమే కాకుండా నటుల సముదాయాలతో తిరుగుతూ ‘కాల్పి’ క్షేత్రంలో ప్రదర్శనలిచ్చాడు. – ఇతను క్రీ.శ. 7,8 శతాబ్దాలకు చెందినవాడు. కాళిదాసు రచించిన నాటకాలను కూడా అతను ప్రదర్శింపజేసినట్లు సాహిత్య చరిత్రకారులు రాశారు. భవభూతి రచించిన నాటకాలు మహావీర చరిత్ర, మాలతీ మాధవం, ఉత్తరరామచరిత.

ఉత్తర రామచరిత అతనికి గొప్ప కీర్తిని తెచ్చి పెట్టింది. వాల్మీకి ఉత్తర రామాయణ కథను తీసుకుని నాటకంగా రచించాడు. వాల్మీకి ఉత్తర రామాయణ కథను విషాదాంతం చేస్తే భవభూతి సీతారాములను కలిపి సుఖాంతం చేశాడు. కొన్ని సన్నివేశాలను ఆయన “కల్పించాడు. తృతీయాంకంలో గంగాదేవి ఇచ్చిన వరం వల్ల సీతాదేవి భూమి మీద ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. శంబూకవధ తరవాత రాముడు పంచవటిలో ప్రవేశించి విరహ దుఃఖంతో మూర్ఛిల్లుతాడు. ఆ సమయంలో సీత అదృశ్యంగా ఉండి రాముడ్ని స్పృశిస్తుంది. ఇందులో కరుణరసం ప్రధానం.
మాలతీమాధవం ప్రేమ కథ, శృంగార రసం ప్రధానం, పది అంకాల ప్రకరణం ఇందులో మాలతి కథానాయిక కాగా, మాధవుడు కథనాయకుడు, మదయంతిక, మకరందులనే జంట ప్రేమ కథ కూడా ఉంది. ఈ రెండు ప్రేమకథలను భవభూతి నడిపాడు. సమాంతరంగా

ఇక మహావీర చరిత్ర పది అంకాల నాటకం. పూర్వ రామాయణ కథనంతా నాటకంగా సులిచాడు. అయితే, కవి దాన్ని మనోరంజకం చేయలేకపోయాడనే విమర్శ ఉంది: కథ విస్తృతం కావడంవల్ల ఆ లోపం ఉండవచ్చు. వాల్మీకి రామాయణంలో కొన్ని కల్పనలు చేశాడు. అయితే, అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రధాన రసం వీరం,

కాకతీయ సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1289 1323 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన ప్రతాపరుద్రుడు ‘యయాతి చరిత్ర’, ‘ఉషారాగోదయం’ అనే సంస్కృత నాటకాలు రాశాడు. రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్న విశ్వనాథుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే లక్షణగ్రంథం రాశాడు. నాటక లక్షణాన్ని ప్రథమంగా చెప్పిన తెలుగువాడు. ఇతనే. తన లక్షణ గ్రంథానికి లక్ష్యంగా ఆయన ప్రతాప కల్యాణమనే నాటకం రాశాడు. నరసింహుడు (1289-1323) అనే కవి కాదంబరీ కల్యాణం అనే నాటకం రచించినట్లు సాహిత్య చరిత్రకారులు గుర్తించారు.

రాచకొండ రాజ్యాన్ని విస్తరించిన రాజు అనపోతనాయకుడు (1360 1385) ‘అభినవ రాఘవము’ అనే నాటకం రాశాడు. ఇది లభించడం లేదు గానీ దీని ప్రస్తావన ‘రసార్ణవ సుధాకరం’లో ఉంది.

సర్వజ్ఞ సింగభూపాలుడు సంస్కృత నాటక రచయిత. కాకతీయుల సామ్రాజ్య పతనం తరవాత రేచర్ల వెలమరాజులు రాచకొండ రాజధానిగా తెలంగాణను పాలించారు. తెలంగాణను 1381 1405 ప్రాంతంలో పాలించిన ఈ రేచర్ల వెలమరాజు రత్నపాంచాలిక లేదా కువలయావళి అనే నాటికను రచించాడు. కువలయావళిగా అవతరించిన భూదేవిని శ్రీకృష్ణుడు వివాగం చేసుకోవడం దీని ఇతివృత్తం. ఇది స్వతంత్ర రచన.

జటప్రోలు (మహబూబ్నగర్) సంస్థానాధిపతి సురభి మాధవరాయలు ఆస్థాన కవి ఏలకూచి బాలసరస్వతి ‘రంగకౌముది’ నాటకాన్ని రచించాడు. 1570-1650 మధ్యకాలానికి చెందిన ఆయన అసలు పేరు వెంకటకృష్ణయ్య. 1730లో జన్మించిన తిరుమల బుక్కపట్నం కిరీటి వెంకటాచార్యులు ‘ఉషాపరిణయం’ అనే నాటకం రచించాడని సాహిత్య, చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన తమ్ముడు తిరుమల బుక్కపట్నం బుచ్చి వెంకటాచార్యులు ‘కల్యాద పురంజనం’ అనే నాటకం రాశాడు. వనపర్తి సంస్థానాధీశుడు అష్టభాషా బహిరీ 17వ శతాబ్దంలో ‘’రామచంద్రోదయం’ అనే సంస్కృత నాటకం రాశాడు.
మహారాష్ట్ర ప్రాంతం కొంత హైదరాబాద్ రాజ్యంలో ఉండేది. అందువల్ల వాళ్ళ శ్రీ నాటకాలతో హైదరాబాద్కు సంబంధం ఉంది. మరాఠీ నాటకరంగం తొలినాళ్ల ప్రముఖ ”సంస్థ ‘కిర్లోస్కర్ సంగీత్ మండలి’ 1893 – 1912 మధ్య కాలంలో మూడు సార్లు హైదరాబాద్ వచ్చింది. 1885లో ‘పూర్ణచంద్రోదయ సాంగ్లీకర్ నాటక్ మండలి’, ‘కేశరావ్ బడోడేరక్ సంస్థ’ ‘నాట్యానంద్ మండలి’ హైదరాబాద్లో ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ ప్రదర్శనతో ప్రభావితుడైబ హైదరాబాద్ షాలిబండలోని స్థానిక రంగస్థల నటుడు శ్యామ్రావ్ న్యాలకల్ అధ్వర్యంలో 1894లో ‘శకుంతల్’, 1896లో ‘సౌభద్ర’ నాటకాలను ప్రదర్శించారు. 1907లో జమృద్ మహల్ మైదానంలో శ్యామ్రావ్ న్యాలకల్ చారుదత్తుని నాటకం ‘మృచ్ఛకటిక’ను ప్రదర్శించారు. 1894 నుంచి 1918 వరకు హైదరాబాద్ మరాఠీ నాటకరంగంలో న్యాల్కల్ యుగంగా పరిగణిస్తారు.

ధర్మవరం గోపాలాచార్యులు 1905 1906 ప్రాంతంలో కృష్ణవిలాసినీ సభను ఏర్పాటు చేసి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నాటక రచయిత కూడా. బళ్లారి రాఘవ 1920 నాటికే హైదరాబాద్లో అనేక నాటక ప్రదర్శనలిచ్చారు. 1912లో ఆయన ప్రదర్శించిన ఒథెల్లో నాటకంలో సరోజినీ నాయుడు సోదరుడు, కవి హరీంద్ర ఛటోపాధ్యాయ నటించాడు.

సరోజినీనాయుడు మేనల్లుడు ఇనుగంటి 1910 ప్రాంతంలో హైదరాబాద్లో ‘హైదరాబాద్ అమోచ్యూర్స్’ అనే నాటక సమాజాన్ని స్థాపించి ప్రదర్శనలిచ్చాడు. ఈ సమాజం నమాజం నుంచి కొంతమంది నటులు చీలిపోయి. 1915లో ఫ్రెండ్స్ యూనియన్ అనే నాటక సమాజాన్ని స్థాపించి ఇంగ్లీష్ నాటకాలను ప్రదర్శించారు. 1913లో సిటి మోహనరంగ పిళ్లే సికింద్రాబాద్లో ‘వాణీవిలాససభ’ అనే నాటక సంఘాన్ని స్థాపించాడు. ఆయన తన నాటకాలను సికింద్రాబాద్లోని రాజా నాగన్న దేవిడీలో ప్రదర్శించేవాడు. ఈ కాలంలో సికింద్రాబాద్లో ఏర్పడిన నాటక సమాజాల్లో కృష్ణమనోల్లాసిని సభ, సరస్వనీ సభ ముఖ్యమైనవి. ఈ సమాజాలకు విశ్వనాథశాస్త్రి నాటకాలను రాసిచ్చేవాడు.

వరంగల్లుకు చెందిన తూము రామదాసు (1856 1904) ‘కాళిదాసు’ అనే నాటకం రాశాడు. సురభి కంపెనీ ప్రదర్శన కోసం ఆయన ఆ నాటకరచన చేశాడు. తొలి తరం నాటకాల శైలిలో ఈ రచన ఉంది. ఇది 1899లో ప్రచురితమైంది. బాలసరస్వతి తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు (1862 1920) కిరీటి వెంకటాచార్య ‘విజయ వైజయన్తీ’ అనే సంస్కృత నాటకం రచించాడు. అది అముద్రితం. బాల్యంలోనే అతను చూపిన ప్రతిభకు మెచ్చి మైసూరు రాజు చామరాజేంద్ర, బాలసరస్వతి అనే బిరుదు ఇచ్చాడు. నవద్వీప (పశ్చిమ బెంగాల్) పండిత మండలివారు ఈయనకు 1839సంవత్సరంలో తర్కతీర్థ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. ఈయన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు సంస్థానాధీశుడు రేపాల గ్రామంలో ఆయన “గ్రామ వెలుగు” నాట్యమండలిని స్థాపించాడు. ఆయన దాదాపు 25 నాటికలు, నాటకాలు రచించాడు. ఆదర్శ లోకాలు (1948), గెలుపు నీదే (1952), గుడిగంటలు, అడుగుజాడలు (1956), కొత్తగుడి (1957), క్రీనీడలు (1957) ఆయన రచించిన నాటకాల్లో విశేష ప్రజాదరణ పొందాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన గవ్వా సోదరులు నాటకాలు రాశారు. గవ్వా జానకిరామిరెడ్డి “దేశబంధు అనే మూడంకాల నాటకం రాశాడు.

ఆంధ్రుల సాంఘిక చరిత్రతోపాటు పలు గ్రంథాలు రాసిన సురవరం ప్రతాపరెడ్డి ”ఉచ్ఛల విషాదం’ (1933), ‘భక్తతుకారామ్’ అనే నాటకాలు రాశాడు.

.తెలంగాణలోని సాధన సమితి పలు గ్రంథాలను ప్రచురించింది. 1939 నుంచి 1943 వరకు ఈ సంస్థ విశేషంగా పనిచేసింది. భాగి నారాయణమూర్తి ‘పరీక్ష చదువు’ నాటకాన్ని ఈ సంస్థ ప్రచురించింది. శేషుబాబు రాసిన ‘అశోక రాజ్యం’ నాటకాన్ని కూడా ఈ సంస్థ ప్రచురించింది. మెదక్ జిల్లాకు చెందిన వెల్దుర్తి మాణిక్యరావు ‘దయ్యాల పన్గడ’ అనే నాటకాన్ని ఆ జిల్లా మాండలికంలో రాశాడు. దీన్ని టాల్స్టాయ్ నాటకం ‘ఫస్ట్ డిస్టిల్లర్’కు అనువాదంగా కాళోజీ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ కు చెందిన ఎస్.కె. ఆంజనేయులు సాంఘిక, చారిత్రక, పౌరాణిక నాటకాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాడు. ఈయన పలు నాటకాలు కూడా రాసినట్లు తెలుస్తున్నది. 1925 ఏప్రిల్ 8వ తేదీన జన్మించిన ఈయన 1945లో ప్రా నిజాం రైల్వేలో ఉద్యోగిగా చేరాడు. నాటక వికాసానికి చేసిన కృషికిగాను యాజమాన్యం ఆయనకు రెండు అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్లు ఇచ్చింది. తాను పనిచేస్తున్న సంస్థలోని మహిళా ఉద్యోగులు నటించేందుకు వీలుగా స్త్రీపాత్రలతో నాటికలు రాశాడు. 1987లో ఆంధ్రజ్యోతి నిర్వహించిన నాటికా రచన పోటీలో ఆయన రాసిన ‘రాధికా స్వాంతనం’ నాటికకు ప్రథమ బహుమతి వచ్చింది. విశాఖ సాహితీ సేవాసమితి నిర్వహించిన పోటీల్లో ఆయన రాసిన – ‘స్మృతి ప్రతీక’ నాటికకు తృతీయ బహుమతి లభించింది. ‘శిరోమణి’, ‘వలయం’, ఆత్మీయులు, రాగరాగిణి’, ‘పవిత్రులు’, ‘చావకూడదు’, ‘నీడలు – నిందలు’ వంటి పలు నాటికానాటకాలు ఆయన రచించాడు.

హైదరాబాద్లో 1964లో ఏర్పడిన కళారాధన నాటక సమాజం కోసం ఆర్.వి.ఎస్. రామస్వామి పలు నాటకాలు రాశాడు. ‘చీకటి కోణాలు’, ‘వలయం’, ‘సుడిగాలి’, ‘గాలివాన’, – కెరటాలు’, ‘వెల్లువ’, ‘శ్రీమాన్ శ్రీపతి’, ‘వర్ధంతి’, ‘గాలిపటం’ తదితర నాటకాలు రాశాడు.నల్లగొండ జిల్లాకు చెందిన తిరునగరి రామాంజనేయులు పలు నాటకాలు, నాటికలు రాశారు. వాటిలో వెట్టిచాకిరి వంటి నాటికలు, తెలంగాణ, వీర తెలంగాణ వంటి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. 1940 – 50 మధ్యకాలంలోని తెలంగాణ ప్రజల జీవితాన్ని, పోరాటాన్ని ఇవి ప్రతిబింబించాయి.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.