పోతన భాగవత భక్తి తత్వం


కావ్యయుగంలో ప్రసిద్ధులైన కవులలో శ్రీనాథుడు, బమ్మెర పోతనామాత్యుడు పేర్కొనదగినవారు. బమ్మెర పోతన రచించిన ‘శ్రీమదాంధ్ర మహాభాగవతం’ ఎంతో విశిష్టమైనది. మనజాతి సంస్కృతిని ప్రతిబింబింపచేసి, మన ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసిన పురాణకావ్యేతిహాసాలు, భాగవత రామాయణ భారతాలు. రామాయణం ఒక కుటుంబ వ్యవస్థకు అక్షరాకృతి అయితే, మహాభారతం మన సమాజానికి నిలువుటద్దంగా నిలిచింది. ఇక ముచ్చటైన మూడవది మహాభాగవతం. ఇది భారతీయ సనాతన ఆధ్యాత్మిక చింతనకు సంకేతంగా, పరతత్వానికి ప్రతీకగా, భక్తి భావనకు ఆలంబనంగా పేర్కొనదగింది.

భక్తి కవిత్వం అనగానే తెలుగువారికి పోతన మహా భాగవతం స్ఫురిస్తుంది. భాగవత భక్తితత్వాన్ని తెలుగువారందరికీ పంచిన వాడు పోతన. పోతన భాగవతాన్ని తెలుగువారు పవిత్ర గ్రంథంగా భావిస్తారు. ఆబాలగోపాలానికి ఇది ప్రాతః స్మరణీయం, నిత్య పఠనీయం. మన పెద్ద వాళ్ళు చిన్నతనంలో మగ పిల్లలకు భాగవతంలోని ‘గజేంద్ర మోక్షం’, ఆడ పిల్లలకు ‘రుక్మిణీ కళ్యాణ’ ఘట్టాలను చదివి వినిపించేవారు. కన్నె పిల్లలు ‘రుక్మిణీ కళ్యాణం’ చదివితే వెంటనే పెళ్ళవుతుందనే విశ్వాసం నెలకొని ఉంది. పోతన భాగవతంలోని ఒక్క పద్యమైనా నోటికి రాని తెలుగువాడు ఉండడని లోకంలో ప్రతీతి. పోతన పద్యాలు నోటికి రావడానికి కారణం, ఆ పద్యాలలోని లలితమైన పదాల కూర్పు, సరళమైన శైలి, శయ్య, పాకం, నడక, ధార మొదలైనవి. పోతన పోత పోసిన కైతలు తెలుగువారి హృదయ ఫలకాల మీద అచ్చుపడ్డాయి. పోతన కవిత్వమనే ‘ పాలలో భక్తి అనే పంచదారను కలిపి ఈ భాగవత రచన ద్వారా తెలుగు వారందరికీ పంచి పెట్టాడని భావిస్తారు.

వ్యాసుడు సంస్కృతంలో రచించిన శ్రీ మహాభాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. దీనిని అనువాదంలా కాకుండా ఒక స్వతంత్ర రచనలా తీర్చిదిద్దాడు. భక్తుల గాథలు ఉపాఖ్యానాలుగా చెప్పేటప్పుడు భక్తి పారవశ్యంలో మునిగిపోయేవాడు. భగవంతుని గుణమహిమలను భక్త్యావేశంతో అభివర్ణించే వాడు. అందుకే ఆంధ్ర మహాభాగవతం వ్యాసభాగవతం కంటే మూడింతలు పెరిగిందంటారు.: పోతన భాగవత భక్తి తత్వం మూలాతిరిక్తంగా పెంచినప్పటికీ పోతన ఔచిత్యాన్ని పాటించాడు. శ్రీ మహాభాగవతంలో మొత్తం పన్నెండు స్కంధాలున్నాయి. రామాయణం కాండలుగా, మహాభారతం సర్వాలుగా విభజించి రచింపబడితే, భాగవత స్కంధాలుగా నింగడించబడింది. స్కంధం అంటే చెరుకుగడలోని ఒక్కొక్క భాగం. చెరుకును తినేటప్పుడు గడలో ఉండే కట్ల దగ్గర విరిచి, నమిలి తింటాం. అప్పుడే అందులోని రసాన్ని ఆస్వాదించి, తియ్యదనాన్య అనుభవిస్తాం. అట్లాగే భాగవతంలోని ఒక్కొక్క స్కంధంలోని కవిత్వం కూడా చెరుకులోని తీపిలాగా ఉంటుందని భావిస్తారు. అందుకే దీనికి ‘స్కంధం’ అన్న పేరు సరిపోయిందంటారు.

పోతన ఆంధ్రీకరించిన శ్రీమదాంధ్ర మహాభాగవతం’ లోని పన్నెండు స్కంధాలలో కొన్ని ఆయన అనంతరం అవి శిథిలం కావడం వల్ల, ఆయన శిష్యులు వాటిని పూరించి, ఆ వెలితిని కనిపించకుండా. చేశారంటారు. కానీ మరి కొందరు భాగవత రచనా కాలంలోనే పోతన తన శిష్యులకు కూడా ఆ రచనలో భాగం కల్పించాలనే సదాలోచనతో స్వయంగానే కొంత పనిని వారికి అప్పగించాడంటారు. ఏది ఏమైనప్పటికీ ద్వితీయ స్కంధంలోని 91వ పద్యం నుండి తృతీయ, చతుర్థ స్కంధాలు, దశమస్కంధంలోని ఉత్తర భాగంలో అక్కడక్కడ, ఇంకా ఏకాదశ, ద్వాదశ స్కంధాలు పోతన శిష్యుడు వెలిగందల నారయ రచించాడనీ, షష్ఠ స్కంధం ఏర్చూరి సింగన, పంచమ స్కంధంలోని ప్రథమ, ద్వితీయ ఆశ్వాసాలలో కొంత భాగం బొప్పరాజు గంగనలు పూరించారని ప్రతీతి.

పోతన జీవితం :

కవి వరేణ్యుడు, భక్తాగ్రగణ్యుడు అయిన పోతన పదిహేనవ శతాబ్ది ఉత్తరార్థంలోని వాడనీ, అంటే 1400-1470 మధ్యకాలంలో జీవించి ఉంటాడనీ పరిశోధకులు భావించారు. పోతన తెలంగాణంలో ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు- ఈనాటి వరంగల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న బమ్మెర గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామనామమే క్రమంగా వీరికి గృహనామంగా స్థిరపడిపోయిందట. అందుకే పోతనను బమ్మెర పోతన అని పిలుస్తారు. అయితే కడపజిల్లాలోని ఒంటి మిట్ట పోతన జన్మస్థలం అని కొందరంటారు. కానీ ఈ వాదం ఆమోదం పొందలేదు.

పోతన కౌండిన్యస గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు. కేసన, లక్కమాంబలు ఇతని తల్లిదండ్రులు. ఇతని అన్న పేరు తిప్పన్న. వీరు స్వతహా శైవ మతస్థులు. తండ్రి కేసన లలితమూర్తి, బహుకళానిధి, దానమాన నీతిధనుడు, శైవశాస్త్ర ఆగమాది మహిమలెరిగిన వాడు. తల్లి లక్కమాంబ ఆదర్శ గృహిణి, భర్తమాట జవదాటని ఉత్తమ ఇల్లాలు. నిరంతరం దానధర్మాలలో, సదాశివ పాదయుగార్చనలో నిమగ్నమై ఉండేది. ఇక అన్న తిప్పన్న కూడా సదా ఈశ్వర సేవనే కోరుకునేవాడు.

ఇటువంటి సదాచార, సంస్కార కుటుంబ వాతావరణంలో నుంచి వచ్చిన పోతన సహజ సద్గుణ. వినయ సంపన్నుడిగా ఎదిగాడు. ఇతను గురుముఖంగా చదువుకొన్నది బహు స్వల్పమే. గురుకుల వాసం చేసి శాస్త్రాధ్యయనం చేయకపోయినప్పటికీ చిదానంద యోగి ద్వారా తారక మంత్రం ఉపదేశం పొంది. దాని మహిమ చేత, విబుధ జనుల వల్ల విన్నంత, కన్నంతనే స్వయంకృషితో, ఆ సరస్వతీదేవి కరుణాకటాక్షంతో సకల విద్యా పారీణుడే గాక, భక్తి కవితాధురీణుడైనాడు. ” శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర సహజ పాండిత్యాన్ని” అలవర్చుకొన్నాడు. అందుకే పోతనను సహజకవి అంటారు. పోతన సహజకవి పోతనగా, భక్తకవి పోతనగా, బమ్మెర పోతనగా, పోతనామాత్యునిగా, పోతన్నగా, పోతరాజుగా అనేకనామాలతో పిలువబడ్డాడు.

పోతన భార్యాబిడ్డల గురించిన వివరాలు అంతగా తెలియరావు. అయితే పోతనకు మల్లన అనే కుమారుడు ఉన్నట్లుగా కొన్ని గ్రంథాల ద్వారా. ప్రౌఢ సరస్వతి బిరుదు ఉన్న కేసన అనే కుమారుడు ఉన్నట్లుగా మరికొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసన పోతనకు కుమారుడు కాదనీ, మనుమడనీ మరికొందరంటారు. పోతనకు కూతురు ఉన్నట్లుగా, శ్రీనాథుని చెల్లిలిని పోతనకిచ్చి వివాహం చేసినట్లుగా కొన్ని చోట్ల ఉంది. కానీ అటు పోతన గానీ, ఇటు శ్రీనాథుడు గానీ ఎవరూ ఎక్కడా ఈ విషయాన్ని తమ తమ గ్రంథాలలో పేర్కొన లేదు. అయితే వీరు సమకాలికులు అన్నది మాత్రం వాస్తవం. పోతన కృతులలో ఒకటైన ‘భోగినీ దండకా’న్ని అంకితంగా పొందినవాడు రాచకొండ సంస్థానాధీశుడు, నెలమ ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుడు. ఇతని ఆస్థానానికి శ్రీనాథుడు వచ్చినట్లు చారిత్రికాధారాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి పోతన, శ్రీనాథులు ఒకే కాలంలో జీవించిన వారని భావించడమైంది. పోతన భాగవత ప్రాశస్త్యం గురించి ఎన్న సింగభూపాలుడు దానిని కూడా తనకే అంకితమివ్వమని పోతనను కోరాడట. అందుకు పోతన అంగీకరించలేదు. పైగా “ఇమ్మను జేశ్వరాధముల కివ్వ”ను గాక ఇవ్వను అన్నాడట. దానితో కోపోద్రిక్తుడైన రాజు పోతన భాగవతాన్ని పాతిపెట్టించాడట. అప్పుడది క్రిమి దష్టమై, శిథిలమై పోయినందువల్ల ఆయాభాగాలను పోతన శిష్యులు వెలిగందల నారయ, ఏర్చూరి సింగన, బొప్పరాజు గంగనలు పూరించి, ఆ వెలితిని పూర్తిచేశారని మరొక ఐతిహ్యం.

పోతన నిరాడంబర జీవి, నిగర్వి, భూమిని నమ్ముకొని హాలిక వృత్తితో జీవికను కొనసాగించిన నిస్సంగుడు. భోగభాగ్యాలను ఎన్నడూ ఆశించలేదు. రాజులను ఆశ్రయించలేదు. శ్రమజీవనమే సుభప్రదం, శాంతిమయమైనదని మనసారా నమ్మినవాడు. అందుకే మనుజేశ్వరుల మన్ననలను తిరస్కరించిన ఆత్మాభిమాని పోతన.

పోతన రచనలు :

పోతన బాల్యంలో ‘వీరభద్ర విజయము’, యౌవనంలో ‘భోగినీ దండకము,’ పిదప (‘నారాయణశతకము’, ప్రొధావస్థలో ‘శ్రీమదాంధ్రమహాభాగవతము’ రచించాడు. ‘వీరభద్ర విజయము’ నాలుగు ఆశ్వాసాలతో కూడుకొన్నది. శివుని చేత సృష్టించబడిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం దీనిలోని ఇతివృత్తం. పార్వతీపరమేశ్వరుల కళ్యాణంతో ఈ కావ్యం ముగుస్తుంది. ఇక ‘భోగినీ దండకము’ శృంగార రసభరితమైనది. దీనిని రాచకొండ ప్రభువు సింగభూపాలునికి అంకితమిచ్చాడు. ఆ రాజుకు, ఒక నేశ్యాంగనకు నడుమ సాగిన ప్రణయం దీనిలోని ప్రధానాంశం. సాధారణంగా ‘దండకం’ అన్నది భగవంతుని స్తుతిస్తూ భక్తి భావబంధురంగా కొనసాగుతుంది. కానీ పోతన దీనిని శృంగారాత్మకంగా తీర్చిదిద్దాడు. అనంతరకాలంలో చాలా దండకాలు ఇదే కోవలో శృంగార రసభూయిష్ఠంగా వెలువడ్డాయి. పోతన రచనలలో మకుటాయమానమైనది మహాభాగవతం. పోతన లౌకిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్ప మార్పును, మలుపును తీసుకొని వచ్చినది ‘శ్రీమదాంధ్ర మహాభాగవతం’, దీని రచనాకాలం నాటికి మానసిక పరిపక్వత పొందిన పోతన ఒక యోగిగా, విరాగిగా, భక్తాగ్రేసరునిగా మనకు కనిపిస్తాడు. పోతన స్వతహాగా శైవమతస్థుడు. అందుకే తొలినాళ్ళలో ‘వీర భద్ర విజయము’ వంటి శివమాహాత్మ్య ప్రచార ప్రధానమైన కథను కావ్యంగా మలిచాడు. కానీ తరువాతి కాలంలో వైష్ణవ మత ప్రధానమైన ‘నారాయణ శతకము’ రచించాడు. ఇక ‘మహాభాగవతము’ కృష్ణ భక్తితో కూడుకొన్ని పరమాత్మతత్త్వ ప్రధానమైనది. అంటే పోతన రాను రాను శివకేశవ భేదాన్ని పాటించని అద్వైతిగా మారాడన్న మాట. హరికి, హరునికి తేడా లేదని, పరమాత్మ అన్నవాడు ఒక్కడేననే హరిహరాద్వైత సిద్ధాంతాని నమ్మాడు.! అందుకే ఏదైనా విష్ణుకథ రాయాలని తలపోశాడు. పోతన పౌర్ణమి నాటి చంద్రోదయ వేళలో. గోదావరీ నదీ తీరంలో ధ్యానం చేసుకొంటుండగా ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి వ్యాసభాగవతాన్ని తెనిగించమని ఆదేశించాడు. అందుకే పోతన తన భాగవతావతారికలో-

పలికెడిది భాగవతమట:

పలికించు విభుండు రామభద్రుండట: నే బలికిన భవహర మగునట : పలికెద వేదొండు గాథ బలుకగ నేలా ?’

అని వినమ్రంగా ప్రకటించుకొన్నాడు. అందుకే భాగవతాన్ని శ్రీరామాంకితం గావించాడు.

భాగవత ప్రాశస్త్యం :

పోతన భాగవతం భక్తికి మారు పేరు. ఇది మధురభక్తిని ప్రబోధించేది. పూర్వులు జ్ఞాన, కర్మ, భక్తి మార్గాలను మానవులకు మోక్షప్రాప్తి సాధనాలుగా నిర్దేశించారు. వీటిల్లో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే కైవల్యాన్ని కైవసం చేసుకోవచ్చుననీ, జన్మరాహిత్యం పొందవచ్చుననీ భావించేవారు. అయితే జ్ఞాన మార్గ పరిణత చిత్తులకు తప్ప అందరికీ సాధ్యమయ్యేది కాదు. కర్మ మార్గం కూడా అంత సులభతరమైన కాదు. నిర్గుణమైన బ్రహ్మాన్ని జ్ఞానం వల్ల పొందగలిగితే, సగుణమైన బ్రహ్మాన్ని భక్తి ద్వారా సాధించవచ్చున.. అంటారు. భక్తి మార్గం అందరికీ అందుబాటులో ఉండి ఆచరణ సాధ్యమైనది. అందుకే పోతన భాగవతాన్ని భక్తి మార్గంలో తీర్చిదిద్దాడు. ఈ భక్తి మార్గంలో శాంతి, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య భావాలు ముఖ్యమైనవి. పోతన తన భాగవతంలో ఈ అయిదు భావాలను గోచరింపజేశాడు. అయితే మధుర దీనిలో ప్రధానపాత్ర వహించింది. ఇక శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం దాస్యం, ఆత్మనివేదనం, సఖ్యం అన్నవి నవవిధ భక్తి మార్గాలు. ఈ తొమ్మిది మార్గాలకు పోతన భాగవతంలో ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అర్జునుడు. అక్రూరుడు, రుక్మిణి, గోపికల మొదలైన భక్తులు ప్రతినిధులుగా నిలుస్తారు.

వీరిలో అంబరీషుడనే భక్తుని చరిత్ర భాగవతంలోని నవమ స్కంధంలో రచింపబడింది. అంబరీషుడు భాగవతోత్తముడు, పరమభక్తుడు. తనకు అపకారం తలపెట్టిన దుర్వాస మహర్షి పట్ల అనువదించాడు. సోమన భక్తి మార్గ ప్రవర్తకుడు, మారన జ్ఞాన మార్గ ప్రవర్తకుడు. ఈ రెండు మార్గాలు, సమంగా కలిసి పోతన భాగవత రచనలో కనిపిస్తాయి. అంటే పోతన కవితలో భక్తి మార్గం, జ్ఞాన మార్గం రెండూ సమప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పురాణానికి ఒక సమగ్ర వ్యక్తిత్వాన్ని, సార్వకాలిక ప్రయోజనాన్ని సాధించి పెట్టిన తెలుగు పురాణం పోతన భాగవతం. అందుకే పురాణ కవిత్రయంలో కవిత్రయ ప్రబంధపరమేశ్వరునిలాగా పోతన ‘పురాణపరమేశ్వరుడు.’ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ఏకైక మహాపురాణం ఆంధ్రమహాభాగవతం. తెలుగులో పురాణ సాహిత్యానికి కవిత్రయం వంటి వారు పాల్కురికి కవిత్రయం వంటి వారు పాల్కురికి సోమనాథుడు, మారన, పోతన, సోమనాథుడు వీర శైవమత ప్రబోధం కోసం భక్త్యావేశ ప్రధానమైన దేశపురాణ దేశపురాణాన్ని ద్విపదలో రచించాడు. మారన మార్గపురాణ సంప్రదాయానువర్తియై గానయోగ్యమైన మార్కండేయ పు
విధమైన కోపంగానీ, పగ గానీ, ప్రతీకారం గానీ ప్రదర్శించలేదు. సమస్తం భగవదధీనమే అని నమ్మాడు. తనను సంహరించడానికి వచ్చిన చక్రాన్ని వేడుకొని, ప్రాధేయపడ్డాడే తప్ప, అహంకరించి, భుజబలంతో ఎదుర్కోలేదు. అహంకారం అనుచితం, సాధువృత్తి సముచితం. అపకారికైనా ఉపకారమే తలపెట్టాలి. అన్నది పాఠ్య భాగమైన ‘అంబరీషోపాఖ్యానము’లోని నీతి.

Get real time updates directly on you device, subscribe now.