మతసామరస్య ప్రతీక దర్గాలు

మతసామరస్య ప్రతీక దర్గాలు

భారతదేశంలో హిందువులే కాక హైందేవేతర మతస్థులెందరో ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గల ఈ దేశంలో హిందుపులు, క్రైస్తవులు, మహ్మ దీయులు, జైనులు, బౌద్ధులు అన్యోన్య సహకార సానుభూతులతో సహజీవనం కొనసాగిస్తున్నారు. స్వార్థమే గమ్యంగా, అధికారమే లక్ష్యంగా ఉండే రాజకీయ నాయకులు, మతాల నాయకులు ప్రజల్లో చిచ్చు పెట్టి విడదీస్తారు. మతకల్లోలాలు కృత్రిమంగా సృష్టించి మారణ హోమాలు జరిపి వికృతంగా నవ్వుకొంటారు. ఇవేమీ పట్టని సామాన్య జనులు, మహ్మదీయులు క్రైస్తవులు తిరుపతి వెంక న్నకు యాదగిరి నరసన్నకు మొక్కులు చెల్లించుకొని కృతార్థులవుతారు. పీర్ల పండుగలను జరిపి ఉర్సులకు వెళ్ళి మహ్మదీయ ఆధ్యాత్మిక వేత్తలను కొలిచి హిందువులు ధన్యులపుతారు. తమ దుఃఖాలను పోగొట్టుకోవడమే సామాన్య జనుల లక్ష్యం. అందుకే వారు మతసామరస్యాన్ని ఆచరిస్తారు. చదువుకోనివారు అజ్ఞానులనబడేవారికీ పై చదువులు చదివి అందలాలెక్కి పాలించేవారికీ ఇంత అంతరముంది. నల్లగొండ జిల్లాలో మహమ్మదీయుల జాన్పాడ్ సైదులు ఉర్సు, జైనుల కొలనుపాక జాతర ప్రధానమైన అన్య జాతరలుగా భావించవచ్చు.

1. జాన్్పడ్ సైదులు ఉర్సు

నేరేడుచర్ల మండలంలో జాన్పాడ్ గ్రామం యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందింది. జిల్లా ప్రజలేకాక పొరుగు జిల్లాలవారు ముఖ్యంగా నిమ్నవర్గాలు ‘జాన్పాడ్ నైదులు’ను ఆర్చిస్తారు. ఈ సైదులు కొన్ని వందలేళ్ళ కింద ఈ ఊరిలో సమాధి అయ్యాడనీ; అయినా సమాధిలో సజీవంగా ఉండి భక్తుల బాధల్ని, యాతనల్ని దూరం చేస్తున్నాడని; సంపదను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని ప్రజల విశ్వాసం. శుక్రవారం వస్తుందంటే గురువారం సాయం కాలం నుండే వందలకొద్దీ భక్తులు ‘దర్గా’ చేరుకుంటారు. లంబాడీలు, హరిజ నులు, రెడ్లు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బ్రాహ్మణులు, కమ్మ, కాపు, బలిజ-సమ స్తకులాల, సమస్త తెగల ప్రజలు తమ కులాల్ని, మతాల్ని, తెగల్ని, జాతుల్ని, విశ్వాసాల్ని, భాషల్ని, సంప్రదాయాల్ని ప్రక్కకు పెట్టి, సులువుగా, మతసామరస్యానికి సాక్షిగా, అద్భుత ‘శక్తి’గా నమ్మి పూజించేది ‘జాన్పాడ్ దర్గా’నే. కాబట్టే ప్రజల పేర్లు ఈ జిల్లాలో సయ్యద్ జాన్మియా, జాన్ ఖాన్, జానారెడ్డి, జానయ్య, నైదయ్య, నైదిరెడ్డి, జానమ్మ అని ఎక్కు వగా ఉంటాయి.పిల్లలు పుట్టాలని, పుట్టిన పిల్లలకు రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఎద గాలని, ఎదిగిన అమ్మాయిల పెండ్లిళ్ళు జరగాలని, చదువుకున్న అబ్బాయిలకు ఉద్యోగాలు రావాలని, వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని, పశువులు చల్లగా ఉండాలని – నైన్సును, శాస్త్రాన్ని, డాక్టర్లని, వారి వైద్యాన్ని నమ్మక ప్రతి ఏడూ కుప్పలు తిప్పలుగా, రకరకాలుగా వచ్చిపడే రోగాల్ని, వాటి బాధల్ని దూరం చేయమని “దర్గా” చేరి, నై వేద్యం పెట్టి, తలవెంట్రుకలు తీయించి, గొర్రెల్ని, మేకల్ని, ‘బలి’గా కాకుండా మహ్మదీయ పద్ధతిలో ‘జూబా’ చేయించి, అక్కడే పలావు వండి, నైదులుకు నైవేద్యంగా పెట్టి పూజించే భక్తులు అసంఖ్యాకం. వారి అంతులేని విన్నపాలు సదా నిజం.

జాన్పాడ్ సైదులు దర్గా

‘జాన్పాడ్’ నైదులు అసలు పేరు హజరత్సయ్యద్ జానిమియా ఉరఫ్ జాన్పాడ్, హజరత్ రహమతుల్లాలే ఉరఫ్ హజరత్ మొహియుద్దీన్ షహీ అని ‘దర్గా’ వద్ద ఉండే ‘ముజావర్’ మసీదులో నమాజ్ చదివించే ‘ముతువల్లి’ అన్నారు. ప్రధానంగా భక్తులు పూజించేచోట రెండు సమాధులున్నాయి. అందులో ఒకటి జాన్ పాడ్ నైదులుది. రెండవది అతని అనుచరుడు హజరత్ మొహినొద్దీన్ షహీద్ అని వారున్నారు.

దర్గాను దర్శిస్తున్న భక్తులు

రెడ్డిరాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించే రోజుల్లో నల్లగొండ జిల్లాలోని వజీరాబాద్ ప్రాంతానికి ఇస్లాం మత ప్రచారకుడైన సైదులు వచ్చి, ఒక శివాలయంలో విడిది చేశారట, అది చూచి అక్కడి బ్రాహ్మణులు తక్షణం దేవాలయం ఖాళీ చేయాలని ఆజ్ఞాపించగా ‘నైదులు’ అందుకు ఒప్పుకోలేదట. దాంతో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసిందట. నైదులుతో ఆ బ్రాహ్మణులు ఏ మతాన్ని అయితే మీరు ప్రచారం చేస్తున్నారో ఆ దేవుడినికోరి వర్షాలుపడని ఈ ప్రాంతంలో వర్షాలు కురిపిస్తే తాము కూడా ఇస్లాంమతంలో చేరుతామని పందెం కాశారట, ‘నైదులు’ సరేనని ప్రార్థనలు జరిపి వర్షం కురిపిం చాడనీ, అన్న మాట ప్రకారంగా బ్రాహ్మణులు మతం మార్పిడి చేసుకోవడం జరిగిందని ఒక కథ ప్రచారంలో ఉంది.1

ఈ కథను ఇస్లాం మతంపై ఆచంచల విశ్వాసం కలిగినవారు ప్రచారం చేస్తుంటారు. ఇక మరో కథను అనుసరించి – ఇస్లాంమతాన్ని ప్రచారం చేస్తూ ‘సైనికులా’ కత్తులు, కటొరాలతో, తమ రాజ్యంలో ప్రవేశించిన సైదులు
: బృందాన్ని తమ రాజ్యపు పొలిమేరలు దాటిహమ్మని అక్కడివారు ఆజ్ఞాపించా రట. ఫలితంగా జరిగిన హోరాహోరీ యుద్ధంలో సైదులు బృందాన్ని స్థానికులు ఓడించి వారి తలలు నరికివేయడం జరిగిందట. తలలు లేకున్నా గుర్రాలపై వీరవిహారం చేస్తుండగా వారికి ఓ గొల్లభామ ఎదురుపడడం జరిగిందట. దాహం వేస్తుంది, కూసిన్ని పాలు ఉంటే పోయి అని సైదులు దళం అడిగితే ‘పాలు’ ఊళ్ళో అమ్మి తిరిగివస్తూన్న గొల్లభామ లేనన్నదట. ఓమారు ‘కుండ’లో చూచి ‘చెప్పమని ‘సైదులు’ అనడం, ఆశ్చర్యంగా ‘పాలు’ ఉండడం, వారు తాగినా ఇంకా పాలు మిగిలిపోయాయట. తాగిన ‘పాల’కు ప్రతిఫలంగా వరాలు ఇచ్చి వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మని గొల్లరామును నైదులు ఆదేశించడం జరిగిం దట. కొంత దూరం వెళ్ళిన గొల్లభామ తాను పాలుపోసిన వ్యక్తులెవరికీ ‘తలలు’ లేకపోవడం గుర్తొచ్చి వెనుతిరిగిందో లేక మానవ సహజమైన ఆసక్తితో వెను తిరిగి చూచిందో గుత్రాలపై వెళ్తున్న ‘మొండెములు’ అన్నీ క్రింద పడిపోయి సమాధి అయ్యాయట. గొల్లబామ కూడా శిలగా మారిందట. ఆ సమాధి అయిన స్థలమే ఈ జాన్పీడ్ దర్గా అని, గొల్లభామ ‘శిల’గా మారిన స్థలాన్ని ‘గొల్ల గుట్ట’ అని పిలుస్తారని ఇక్కడికి వచ్చిన వ్యక్తులు కథలు కథలుగా చెప్పుకుం టారే తప్ప ఎటువంటి ఆధారాలు కాని, శాసనాలు కాని, చరిత్రకోసం ‘సాక్ష్యాలు’ గానీ లేవు.

ఆధారాలు లేని ఏ కథ అయినా ఎన్నో రకాలుగా మారే అవకాశం, మార్చే అవకాశం ఉంది కాబట్టి, రాబోవు కాలంలో ఈ కథలు ఎలా మారినా ఆశ్చర్యం లేదు. సమాధి కాబడిన స్థలంలో ‘దర్గా’ ఎలా వచ్చిందన్న ‘ప్రశ్న’ వేస్తే – దానికి ఒక కథ చెప్పారు. ఇక్కడి భక్తులు. అప్పట్లో – జాన్పాడు ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి శీలం సిద్ధారెడ్డి. ఆయన ఎంతో ప్రేమగా చూచు కునే ‘ఎద్దులు’ తప్పిపోయాయట, బాధ పడుతున్న ‘రెడ్డి’ కలలో ‘నైదులు’ కనిపించి తన సమాధిపై ‘గుమ్మీజ్’ కట్టించి, రోజూ ‘పాతేహ’ జరిపిస్తే తప్పి పోయిన ఎద్దులు తిరిగి వస్తాయని చెప్పడం జరిగిందట. తెల్లారేసరికి ఎద్దులు తిరిగి రావడంతో సిద్ధారెడ్డి ‘గుమ్మీణ్’లు కట్టించి ‘చదివింపులు’ జరిగేలా చూశాడనేది కథ. ‘సాక్ష్యంలేని కథలు బ్రతుకవు – జీవంలేని కథలు ప్రజల్లో నిలువవు.’ అసలు ఈ కథలు ఏవీ ఇక్కడి భక్తులకు అనవసరం. ఇస్లాం మత – వ్యాప్తి, రెడ్డిరాజుల ప్రతిఘటన, యుద్ధం, తలలు నరకడం, సమాధులుండడం, ఇవన్నీ ఎవరికి అక్కరలేవు. వారికి ఉన్నదల్లా ‘నైదులు’ దర్గా కెళ్తే కోరికలు నెరవేరుతాయనేది మాత్రమే. భక్తులకు ప్రధానమైంది తాము కొలిచే వ్యక్తిపై ‘విశ్వాసం’ మాత్రమే, అందుకే ప్రతి శుక్రవారం కొన్ని వందల సంఖ్యలో కదిలి వచ్చే భక్తులలో నిండుగా ఆ విశ్వాసం ఉంది. గత ఇరవై సంవత్సరాల నుంచి భక్తుల రాక విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రతివారం పర్వదినాల్లో వెయ్యి నుంచి పదిహేను వందల ‘పొట్టేళ్ళు’ ‘నైదులు’ స్వామి పేరుమీద ‘జాబా’ వేయబడుతాయి. భక్తులు తాము తెచ్చిన మేక పొట్టేళ్ళును ‘దర్గా’ చుట్టూ ప్రద క్షిణలు చేయించి, ఆ తర్వాత – ముజావరు చేత ‘జూబా’ చేయిస్తారు. మాంసం పలావు వండి ‘సైదులు’కు నైవేద్యం పెట్టి చదివింపులు చేస్తారు. తల వెంట్రు కలు దేవుని పేరు మీద తీయించుకుంటారు. ఈ విధంగా మతసామరస్య ప్రతీకగా దర్గాలు భారతదేశంలోని ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోవడం జరిగింది

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ 9640811664

Get real time updates directly on you device, subscribe now.