నాన కు “స్ఫూర్తి గ్లోబల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డ్

నాశబోయిన నరసింహ(నాన)

నాశబోయిన నరసింహ(నాన)కు “స్ఫూర్తి గ్లోబల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డ్” ప్రదానం:
యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య పర్యవేక్షకుడు, కవి, రచయిత నాశబోయిన నరసింహ (నాన)”స్ఫూర్తి అంతర్జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారం ( స్ఫూర్తి గ్లోబల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డ్2021)” అందుకున్నారు.ప్రతి యేటా వివిధ రంగాల్లో నైపుణ్యత ప్రదర్శించిన వారికి గౌరవ ప్రదంగా అందజేసే ‘స్ఫూర్తి అంతర్జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారాల వేడుకలు 2021’ స్పూర్తి సర్వీసెస్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నాదెండ్ల భాస్కరరావు,తెలంగాణ డిజిపి కార్యాలయం డి.ఎస్.పి. వంశీ మోహన్ రెడ్డి,తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (TFCC) అధ్యక్షుడు,నిర్మాత,దర్శకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌, జాతీయ మానవ హక్కుల సంస్ధ తెలంగాణ ఉపాధ్యక్షుడు బండారి దేవేందర్, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుముల బాల్ రెడ్డి,స్పూర్తి సర్వీసెస్ సొసైటీ సంస్థ చైర్మన్ డా.ఆకుల రమేష్ మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా నరసింహకు” స్ఫూర్తి గ్లోబల్ బెస్ట్ సర్వీసెస్ అవార్డ్ 2021″ప్రదానం చేసి మెమెంటో,సర్టిఫికెట్,శాలువా తో ఘనంగా సన్మానించారు.

నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరసింహ గత ఇరవై ఏళ్ల కాలం నుంచి వైద్య ఆరోగ్యరంగంలో క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం ద్వారా వృత్తిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ వివిధ వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా,ప్రవృత్తి పరంగా సమాజ హితం,సామాజిక చైతన్యం కలిగించే సాహితీ సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు.మరో వైపు”స్పూర్తి అంతర్జాతీయ అత్యుత్తమ సేవా పురస్కారం” అందుకోవడం పట్ల వైద్యారోగ్యశాఖ సహోద్యోగులు, సాహితీ మిత్రులు, బంధువులు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.