నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

*నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు*

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన దేశ సరాలకు అనుగుణంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించడం జరిగింది.
దీనిలో 389 మంది సభ్యులుగా ఉన్నారు . ఇందులో ముఖ్యంగా బి ఎన్ రావు గారు సలహాదారులుగా, డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా, డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు అధ్యక్షులు గా ముఖ్య భూమిక పోషించారు

:రాజ్యాంగ దినోత్సవ వేడుకలు 2015 నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించి నప్పటి నుండి ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆజాద్ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ నెల 26న పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షత వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ ముసాయిదాను 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఇది 26 జనవరి 1950 నుండి పూర్తిస్థాయిలో అమలులోనికి వచ్చింది. రాజ్యాంగంలో మొదట 22 భాగాలు 395 ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూలు ఉన్నాయి. 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఐదు భాగాలుగా 465 ఆర్టికల్స్ 12 షెడ్యూల్స్ గా చేర్చారు.
భారత రాజ్యాంగం భారత దేశానికి సర్వోత్కృష్ట చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారత దేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం గా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజు న గణతంత్ర దినం గా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి? పరిపాలన ఎలా జరగాలి? అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు,ఆయా వ్యవస్థల అధికారాలు ఇందులో పొందుపరిచారు.
భిన్నత్వంలో ఏకత్వం మును సాధిస్తున్న భారత దేశంలో విభిన్న మతాలు, భాషలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలు వివిధ పరిమితులు మినహాయింపులను సంపూర్ణంగా వివరించడం వల్ల మన రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, శాసన,ఆర్థిక పరిపాలన సంబంధాలను విస్తృతంగా గుర్తించి మారుతున్న కాలపరిమితి లకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించడం, కొన్ని అంశాలను తొలగించడం మరికొన్ని అంశాలను చేర్చడం వల్ల మన రాజ్యాంగం సువిశాలంగా రూపొందింది.
మనదేశానికి సర్వోన్నత శాసనం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు విధుల విభజన నుంచి సంక్రమించాయి.
పార్లమెంటరీ తరహా విధానం,సార్వజనీన వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు, ఏక పౌరసత్వం,లౌకికరాజ్యంఅనగా మత ప్రమేయం లేని రాజ్యం.రాజ్యాంగాన్ని కూడా దృఢ, అదృఢ లక్షణాలు సమ్మేళనం, అర్ధ సమాఖ్య,స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ , న్యాయ నిర్ణయ సమీక్షాధికారం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, ద్విసభా విధానం లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల్లో విధానసభ, విధాన మండలి,పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, స్వయం ప్రతిపత్తి ఉన్న కమీషన్స్ , 7వ షెడ్యూల్లో ప్రాథమిక హక్కులు మూడవ భాగము 12 నుండి 35 ప్రకరణాల వరకు ఆదేశిక సూత్రాలు 4 వ భాగము లో 36 నుంచి 51వ ప్రకరణ వరకు, ప్రాథమిక విధులు 4(A)భాగంలో 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
ఇలా ఎన్నో అంశాలు పొందు పరచుకున్న మన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ…. ప్రపంచ చరిత్రలోనే అరుదైన అపురూపమైన రాజ్యంగాగా కీర్తింప బడేటట్లు గా తీర్చిదిద్దుట ప్రతి భారతీయ పౌరుడి, మేధావుల, రాజకీయ నాయకుల న్యాయకోవిదులు యొక్క గురుతర బాధ్యత.

—– *ప్రతాపగిరి శ్రీనివాసు*, హనుమకొండ*,
*79931 03924*

Get real time updates directly on you device, subscribe now.