కొల్లాబత్తుల సూరయ్య’ వంశ ప్రస్థానం/ సూర్య కుమార్

కొల్లాబత్తుల సూరయ్య' వంశ ప్రస్థానం*

‌శీర్షిక:-
*’కొల్లాబత్తుల సూరయ్య’ వంశ ప్రస్థానం*
అలలు(25) ప్రక్రియలో..
———————————————
1.
గౌరవమర్యాదలే మిన్నని తెంచిన మా వంశవృక్షం
ఒదిగి ఎదుగుచునున్న మా వంశం
సామాన్యం నుండి మెరుగుపడిన మా జీవనయానం
స్వశక్తినే నమ్మి కృషి చేసే సిద్ధాంతిక విధానం!!
——————————————
2.
భూత భవిష్యత్తులో పేరు పొందు నైజం
ప్రేమానురాగయుత తీరు ప్రశంసనీయం
అనాదికాలాన ఆచరించింది హైందవత్వం
కాలక్రమంలో కొందరు స్వీకరించింరి క్రైస్తవత్వం!!
———————————————
3.
ఒడిదుడుకుల జీవనంలో మనోనిబ్బర గమనం
ప్రేమలు ఆప్యాయతలను పంచే తత్వం
పట్టినపట్టుని విడువని మొండి స్వభావం
జీవన విధానంలో మనో నిబ్బరంతో గమనం!!
———————————————
4.
కోనసీమే కొల్లాబత్తుల వంశానికి జన్మస్థలం
గంగయ్యతో కొల్లాబత్తుల వంశం పశ్చిమాన ఆరంభం
గోదావరి దాటి పాలకొల్లులో స్థిర నివాసం
కొల్లాబత్తుల భావితరాలకు ఇదే ఆవాసం!!
———————————————
5.
భూస్వామియై అరకను చేబూని ఆరంభించెను సేద్యం
స్వేదము చిందించుతునే చేకూర్చెను సిరుల ధాన్యం
సతీపతుల అన్యోన్యమైన జీవన సంసారం
తనయులైన సూరయ్య పరదేశుల సహకారం!!
———————————————
6.
సంపాదనెంచి రంగూను బర్మా గల్ఫ్ ల విదేశీయానం
వృద్ధిబాటలలో కొల్లాబత్తుల సంతతి పయనం
బహుగా విలసిల్లే కొల్లాబత్తుల బహుజనం
వైద్య మత న్యాయ విద్యా రంగాలలో పేరొందె సంతానం!!
———————————————
7.
సూరయ్య మంగమ్మ జీవిత భాగస్వాములు కాగా
తనయులు కుమార రత్నం వెంకట్రావు, సుందర్రావులు
సూరయ్య పనులలో చురుకుదనం మెండు
అందుకే ఆస్తులను సంపాదించుటలో ఘనుడు!!
———————————————
8.
కనిష్ఠుడు సుందరరావు కి కాంతమ్మతో వివాహం
వీరికి కుమార్తెలిరువురు కలిగిరి
పెద్ద కుమార్తె బేబీ సరోజిని
చిన్న కుమార్తె జయ కుమారి!!
———————————————
9.
జ్యేష్ఠుడు కుమార రత్నం కొలది కాలంలో మరణించె
కలిగిన కుమారుడుకి రాజారావుగా పేరెట్టె
చిన్నాన్న చిన్నమ్మల సంరక్షణలో పెరిగె
ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగె!!
———————————————
10.
రాజారావు వివాహము భాగ్యవతితో జరిగె
సూర్యకుమార రాజబాబు, రాజ కుమారిలు జన్మించె
రాజబాబు సువర్ణను వివాహమాడె
ముగ్గురు కుమారులు కలిగె!!
———————————————
11.
రాజబాబు తొలి కుమారుడు భాగ్యరాజు
ద్వితీయ కుమారుడు శరత్ చంధ్ర
కనిష్ఠ కుమారుడు రవి వర్మను పేర్లను పెట్టెను
రాజ బాబు కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసెను!!
———————————————
12.
రాజ కుమారిని రమేష్ కిచ్చి వివాహము చేసిరి
దివ్య,విద్య కుమార్తెలు కలిగిరి
దివ్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాయెను
విద్య ఇంజనీరింగ్ శాఖను చేపట్టెను!!
———————————————
13.
కొల్లాబత్తుల పెద వెంకట్రావు బర్మా సవారులు
కమలమ్మతో పెండ్లై ఏకైక సంతానం కలిగెను
ప్రసాదరావుగా నామకరణం చేసిరి
వైజాగ్ లో ఆరోగ్య విస్తరణాధికారిగా చేసిరి!!
———————————————
14.
కమలమ్మకు మరొక పేరు నర్సమ్మ
వాక్చాతుర్యం తో కూడిన ప్రేమను కురిపించే అమ్మ
భర్త కుటుంబ పోషణకై బర్మా,రంగూన్ లలో ఉండేవారు
కుటుంబాన్ని సవ్యంగా నర్సమ్మే నడిపించే వారు!!
———————————————
15.
కాలక్రమంలో ఆస్తులు హరించుకు పోయాయి
కష్టాలతో గంజన్నం ఆహారంగా
భుజించారు
జీవితచక్ర భ్రమణంలో కూలినాలీ చేసారు
మనో నిబ్బరంతో జీవన నావను నడిపారు!!
———————————————
16.
మంచికి మారుపేరు ప్రసాదరావు
ధర్మ పత్నిగా వచ్చెను సుగుణా భాయి
నలుగురు సంతానంనకు జన్మనిచ్చిరి
సుగుణ మంచి ఉపాధ్యాయురాలిగా పేరొందిరి!!
———————————————
17.
సంపాదనలో కొంత పొదుపు చెయనారంబించారు
కొలదికాలంలోనే మదుపు చేయగలిగారు
పిల్లాపాపలు కూడా సహకరించారు
క్రమేణా ఆర్ధికంగా పుంజుకున్నారు!!

———————————————
18.
కల్మషం లేని మనిషి నర్సమ్మ
వంశాంకురముల ఆలనా పాలన కాంక్షించింది
ముదిమి వయసున మునిమనుమలనూ ఆడించింది
తానిర్మించుకున్న ఇంట్లోనే తుది శ్వాస విడిచింది!!
———————————————
19.
సుగుణా ప్రసాద్ ల జ్యేష్ఠ సంతానం సూర్య కుమార్
విజయ జ్యోతి,హారతి, స్వరూపలు ఆడవారు
హారతి మెరుగైన తెలివితేటలు ప్రదర్శించె
కానీ హారతి చిరు ప్రాయమునే ప్రభువు చెంతకేగె!!
——————————————–
20.
సూర్య కుమార్ నకు నిర్మల కుమారితో పెండ్లి జరిగె
వీరికి సంతానము కలుగుట ఆలస్యమాయె
సంతానము కొరకై ప్రార్థనలే చేసిరి
ప్రభు కృపతో ఇరువురు కుమారులు కలిగిరి!!
———————————————
21.
పెద్ద కుమారునికి సూర్య తేజ అని
చిన్న కుమారునికి సూర్య కిరణ్ అని పేర్లు పెట్టిరి
ఇరువురినీ క్రీస్తు సేవకు సమర్పించుకునిరి
ఇద్దరూ బైబిల్ వేదాంత విద్యనెంచుకునిరి!!
———————————————
22.
తొలి కుమార్తె జ్యోతికి నరసింహ రావుతో పెండ్లాయె
రైల్వేలో ఉద్యోగం చేసెను నర్శింహ రావు
ఏకైక కుమార్తెకు మోనికా మారీ గోల్డ్ పేరు పెట్టెను
మారీ గోల్డ్ ఫార్మసీ లో శిక్షణ పొందెను!!
____________________________-
23.
కనిష్ఠురాలు స్వరూపకి మాణిక్య రావుతో పెండ్లాయె
ఈయన కళాశాల లెక్చరర్ గా విధులు నిర్వర్తించె
వీరికి ఇరువురు సంతానం కలిగెను
శశి కిరణ్,సుగుణ గీతిక అని పేర్లు పెట్టెను!!
———————————————
24.
గుణవంతుని క్రియల చేత ఘనత పొందును వంశం
పరుల యొక్క క్షేమం గాంచి సాయమందించు నైజం
మంచితనమునే కవచంగా ధరించారు
ప్రసాద్ సూర్య కుమార్ లు సమాజ సేవనెంచారు !!
———————————————
25.
ఆంధ్రరాష్ట్రములో పశ్చిమమున మావంశ ప్రస్థానం
ఈ రీతిన ఖ్యాతినొందె మా సూరయ్య వంశవృక్షం
మూడు పువ్వులు ఆరు కాయలై వెలసె మా వంశవృక్షం
భావిబాటలలో కొల్లాబత్తుల సూరయ్య వంశవృక్షం!!
————————————-
కొల్లాబత్తుల సూర్య కుమార్
ఉపాధ్యాయుడు
పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెల్ నంబరు:-8555929281.
———————————————
*హామీ పత్రం*
అలలల ప్రక్రియలో నేను రాసిన *కొల్లాబత్తుల సూరయ్య వంశ ప్రస్థానం* నా స్వీయ రచన అని తెలియపరచుకుంటూ హామీ పత్రం మీకు సమర్పించుకుటున్నాను.
-కొల్లాబత్తుల సూర్య కుమార్.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Get real time updates directly on you device, subscribe now.