పరిశుద్ధ గ్రంధము నుండి పరమాత్మ పలకరింపు

Bheri madhu

📖📗📕📘 📙📚📓📒📕📖📗📘📙
💐👍 *పరిశుద్ధ గ్రంధము నుండి పరమాత్మ పలకరింపు* 👌💐
**************************
నేను నా ప్రియునిదానను అతడు నాయందు ఆశాబద్ధుడు. (పరమగీతం 7:10)
నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినమువరకు ఆయన కాపాడగలడు. (2తిమో 1:12)మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. (రోమా 8:38,39)నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని. … నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. (యోహా 17:12)
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. (కీర్త 149:4) నరులను చూచి నేను ఆనందించుచునుంటిని. (సామె 8:31) తాను మనలను ప్రేమించిన మహాప్రేమ. (ఎఫె 2:4) తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు. (యోహా 15:13)మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. (1కొరిం 6:19,20) మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. (రోమా 14:8)
  💐
యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకొనుడి. (కీర్త 34:16)
మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను. (ద్వితీ 11:18) ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు. (యెహో 1:8)
వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది. వారి అడుగులు జారవు. (కీర్త37:31)బలాత్కారుల మార్గములు తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొనియున్నాను. (కీర్త 17:4) నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. (కీర్త 119:11)
ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది.దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు. (2 పేతు 1:19)ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకైఅవి వ్రాయబడియున్నవి. (రోమా 15:4)…..ఆమెన్……!
💐
Bro.బేరి మధుసూధన్(వేద అధ్యయనం)6301932933//కర్నూలు berimadhusudhan@gmail. com📚📕📖📗📘📙📙📘📗📖📚

Get real time updates directly on you device, subscribe now.