సంబరం అంబరములో ఎగిసే

రచన కొప్పుల ప్రసాద్

సంబరం అంబరములో ఎగిసే…!!

గణతంత్ర మా
విశ్వ దీవుల్లో ఆనంద కేళీ విలాసమా
సంబరమంతా అంబరములో
వర్ణపు పూల వర్షమై కురిసిన సుందర దృశ్యమా..

మూడు రంగులే నీలాకాశం లో
ఇంద్రధనస్సును తాకిన సువర్ణ పతాకమా
నేలపై లేత మనసులో పొందిన భావోద్వేగమా
చేతి కర్రకు విరబూసిన మువ్వర్ణపు పుష్పమా…

ఘనమైన దేశములో
విఘ్నాలను తొలగించుకొని
స్వేచ్ఛా స్వాతంత్ర్యపు సమానత్వమా
ప్రతి పౌరుడి హృదయ సీమ పై గౌరవ చిహ్నమా…

యావద్భారతం నిండైన మనసుతో
జాతి కుల మతాలను పక్కనపెట్టి
గగనములో గాలితో కలిసి ప్రవాహంలో
నీవు చేసే విన్యాసాలకు వందన సమర్పణమా…

ధర్మరక్షణకు భారతీయుడు చేతిలో విష్ణు చక్రమా
సర్వమతాల సారం ఎరిగిన పవిత్ర గ్రంథమా
క్రీడాకారుల చేతిలో విజయపు గర్వమా
హిమగిరి శిఖరాల్లో ఉవ్వెత్తున ఎగసిన ఆకాశగంగవా..

సైనికుని చేతిలో మీసం మెలేసే పౌరుషమా
చిన్న పిల్ల వాడికి కళ్ళల్లో కాంతి పుంజమా
విదేశాలలో ధైర్యాన్ని పంచే ఆత్మాభిమానమా
నిన్ను చూస్తే పులకిస్తుంది ఎవరెస్ట్ శిఖరము…

నీలో కలిసిన పువ్వులే సర్వ మానవ సౌభ్రాతృత్వం
నీ గొడుగు నీడలోనే అందరం సమానత్వం
నీ చల్లని దీవెనలు మాకు వసుదైక కుటుంబం
ఈ దేశ అభ్యున్నతికి చిద్విలాసపు రూపము నీవే..

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Get real time updates directly on you device, subscribe now.