కళ్యాణం కమణీయం

రచన సమదర్శిని

కళ్యాణం కమణీయం

వెన్నెల జల్లులు కురిసే వేళా
వేళాయే హిమము వర్షంలా
క్షణ క్షణంలో నిశీధితో జతకూడి
ప్రకృతి అంతకూడా పరిణతి చెంది
పులకరించిన తపస్సు పలుకరించగా
పడతి పార్వతి పాద క్రాంతము కాగా
పశుపతిని పరిహసించగా సహించని
హిమజా కనులెర్రబడగా మరోరూపం
వీడిన విశ్వనాథుఁడు ప్రత్యక్ష మవ్వగా
కోరిన మనస్సు రాజే రాజేసు డవ్వగా
సురు లెల్లరు వచ్చి హిమవంతుని కోరగా చేసేనిక కళ్యాణ మండపం
సృష్టించబడే కళ్యాణ ఘడియలు
కోట్లాది సురుల సమక్షంబునఁ
పరమేశ్వరునికి పార్వతికి పాణీ గ్రహణమయ్యే దేవతల మనస్సులు
పూల సుగంధ పరిమలాలై విరిసి
కురిసే ఆనంద నిలయమాయే అక్కడ
కనువిందైన కమణీయ దృశ్యం
ఆవిష్కృతమైయ్యే అవని ఆకాశం
పంచ భూతాల సాక్షిగా గురు సురు సురాధి పతుల సమక్షంలోనే పరిణయమయ్యే భూతనాథునికి
చేరువయ్యే శంకనాధం ప్రమదగణాల
పరిరక్షణలో నంది నాట్య విన్యాసాల
సమవీక్షణలో జగత్తు అంత పరవసించే
పర్వదినాన పరిణయ వేదికపై
లోకనాథుని పెళ్లి వైభవం ఒక అద్భుతమై అజరామరమై నిలిచే
సృష్టి కర్తల దివ్యస్మృతికి ఆలవాలమయ్యే దేవాది దేవతల
తదాస్తు దీవెనలు నడుమ
లోక కల్యాణం కమణీయమయ్యే
ఆది దంపతుల దర్శనోత్సవం
ఇదే ఇదే రండి రండి వీక్షించండీ
మహాదేవుని ఆథిత్యాన్ని ఆస్వాదించండి.
రండి రండి రండి రండి

Get real time updates directly on you device, subscribe now.