మూడున్నర ద‌శాబ్ధాల క‌ల నెర‌వేరింది

నిర్మల్

*ఆంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మ‌ల్ కే త‌ల‌మానికం*

*మూడున్నర ద‌శాబ్ధాల క‌ల నెర‌వేరింది*

*అంబేద్కర్ ఆడిటోరియం భవనాన్ని ప‌రిశీలించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

*ఈ నెల 18న ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో క‌లిసి ప్రారంభించ‌నున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి*

నిర్మ‌ల్, ఏప్రిల్ 6: నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో భార‌త ర‌త్న డా. బీఆర్. అంబేద్క‌ర్ భ‌వ‌న్ ఏర్పాటుతో మూడున్న‌ర ద‌శాబ్ధాల క‌ల నెర‌వేరింద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్య‌యంతో నిర్మించిన అంబేడ్క‌ర్ భ‌వ‌న్ ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ బాల‌యోగి గ‌తంలో ఈ భ‌వ‌న నిర్మాణానికి రూ. 25 ల‌క్ష‌లు మంజూరు చేశార‌ని సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు సీయం కేసీఆర్ ద‌శ‌ల వారీగా కేసీఆర్ నిధులు మంజూరు చేశార‌న్నారు. ఈ నెల 18న ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో క‌లిసి అంబేద్క‌ర్ భ‌వ‌న్ ను ప్రారంభించుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. 2 వేల మందితో స‌మావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా విశాల‌మైన ఆడిటోరియం, స‌మావేశ మందిరం, ఇత‌ర ఆధునాత‌న వ‌స‌తుల‌తో దీన్ని తీర్చిదిద్దార‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్ ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ అలీ ఫారూఖీ, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్ర‌తినిది ముడుసు స‌త్య‌నారాయ‌ణ‌, త‌దిత‌రులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.