హృదయపు గూటిలో ఉద్వేగాలు..!!*

కొప్పుల ప్రసాద్

*హృదయపు గూటిలో ఉద్వేగాలు..!!*

హృదయపు గూటిలో ఉద్వేగాలు
చెట్టుపై పక్షుల్లా ఎగురుతున్నాయి
సమయానుకూలంగా అరుస్తూ
కాలానికి పరిష్కారం చూస్తున్నాయి…

అలసిన మనసులో గాయాలు
జ్ఞాపకాలై నిత్యం వేధిస్తున్నాయి
అదుపుతప్పి రెక్కలు విప్పు
ఆలోచనల దారులు మారుతున్నాయి..

ఆశల వలలో చిక్కిన జీవితం
చేపల లాగా గిలగిల కొట్టుకుంటూ
ముడులను విప్పాలని చూస్తే
మెడకు బిగువై బ్రతుకు భారమయ్యే..

కనపడని ఈర్ష్య ఒంట్లో ఇల్లరికం చేస్తుంది
అసూయ ద్వేషాలను తోడు చేసుకోని
మాయ అనే మోహము కప్పి
మానవత్వపు ముసుగులో పెద్దరికం చూపిస్తూనే..

చీకటి పట్టిన ఆకాశం సగం మాత్రమే
మిగతా సగం వెలుగుతుంది కదా
మనసుకు పట్టిన అజ్ఞానం వదిలించుకుంటే
ఆలోచనల వెలుగు అబ్బుతుంది…

దైవత్వము రాళ్ళలో చూడకు
శిల్పం చెక్కిన శిల్పి మోహము లో చూడు
మనసును మౌనంగా ఉంచు
మస్తిష్క సాగరములో అమృతం దొరుకు..

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

Get real time updates directly on you device, subscribe now.