హక్కుల సాధన కోసం సంఘటితం అవుతున్న మేదర్లు

ప్రతాపగిరి శ్రీనివాస్,హనుమకొండ

*హక్కుల సాధన కోసం సంఘటితం అవుతున్న మేదర్లు*

సభ్యత్వ నమోదు చేసుకుంటూ… కదులుతున్న మేదరి వృత్తిదారులు, ఉద్యోగస్తులు మేధావులు, వ్యాపారస్థులు, కళాకారులు,పారిశ్రామికవేత్తలు* .

తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం పిలుపుమేరకు అన్ని వృత్తిదారులకు ఏవిధంగానైతే ప్రభుత్వ అండదండలతో సబ్సిడీల తో కూడిన రుణ సదుపాయాలు అందిస్తూ లబ్ధి చేకూరుస్తుందో అదే విధంగా మేదరి వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారులకు, వ్యాపారస్తులకు ధర్మంగా, న్యాయంగా తమ వాటా తమకు లభించాలంటే…… *తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం నాయకత్వంలో పని చేస్తూ* … నాయకత్వానికి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ ..హక్కుల సాధన కోసం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు అవుటకు సంఘ సభ్యత్వ పొందుతూ…మరియు వివిధ స్థాయిలలో అనగా *గ్రామ, మండల, జిల్లా రాష్ట్ర* కార్యవర్గాల లో *నేను అనే భావం కాకుండా మనము అనే ఐక్యమత్యం భావంతో* బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘ నియమావళి ప్రకారం ఉద్యమ స్ఫూర్తితో చైతన్యంతో కదం తొక్కి కదులుతున్నరు.

*ప్రధాన డిమాండ్స్* :

1.వెదురు బొంగు లు ఉచితం గా
వెదురు సొసైటీల ద్వారా ప్రభుత్వం అందచేయాలి.

2.మేదరి ఫెడరేషన్ కు నిధులు కేటాయించి .
సబ్సిడీ తో కూడిన ఋణ సదుపాయాo కల్పించాలి.

3.చట్టసభల్లో మేదరులకు ప్రాతినిద్యం కల్పించాలి

4.ST రిజర్వేషన్ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా మేదరి జాతికి కల్పించాలి.

5. మేదరి కుల సంఘ భవణ నిర్మాణములకు అన్ని జిల్లా కేంద్రాలలో స్థలం, నిధులు కేటాయించాలి.

6. వృత్తి నైపుణ్య శిక్షణ ను మేదరి వృత్తి లో కొనసాగుతున్న యువతీ,యువకులకు ప్రభుత్వం ఇవ్వాలి.

7. అన్ని ప్రభుత్వ పథకాలను పేద మేదరు లకు ప్రభుత్వం అందజేయాలి
—— *ప్రతాపగిరి శ్రీనివాస్,హనుమకొండ,7993103924*

Get real time updates directly on you device, subscribe now.