సంఘసంస్కర్త – కందుకూరి

అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం

అంశం:-
కందుకూరి వీరేశలింగం పంతులు గారు
సంఘసంస్కర్త – కందుకూరి
……………………….. పున్నమ్మ, సుబ్బరాయుడుల వరప్రసాదివై రాజమండ్రి లో జన్మించిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆంధ్రదేశమున మొదటి సంఘసంస్కర్త.
విగ్రహఆరాధన మూఢనమ్మకాలను వ్యతిరేకించి ఆంధ్రదేశమున మొదటి బ్రహ్మసమాజ స్థాపకుడు………….!!

వితంతువివాహాలను ప్రోత్సాహించి, బాల్యవివాహలవ్యతిరేకుడై స్త్రీ విద్యావ్యాప్తికై ,బాలురతో కలసి సహవిద్యావిధానానికి శ్రీకారం చుట్టిన స్త్రీజనోద్ధారకుడు……..!!

సమాజాసేవలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా”హితకారిణి”
సమాజాన్ని స్థాపించి దానికోసమై యావదాస్తిని దానం చేసిన అపర త్యాగశీలి…………!!

సాహితీవేత్త తెలుగునాట తొలి సాంఘిక నవల రాజశేఖరచరిత్ర సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్రాసిన ఎందరికో ప్రేరణ కలిగించిన నవల.
రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం, దక్షిణ గోగ్రహణ నాటకాలు ,ఆంధ్రకవుల చరిత్రను వ్రాసి, నీతిచంద్రికను పూర్తిచేసిన
సాహితీద్రష్ట. వివేక వర్ధిని, చింతామణి పత్రికలను స్థాపించి సమాజాభివృద్ధికి తోడ్పడి”అభినవ గద్య తిక్కన” గా ప్రసిద్ధి చెందిన
కందుకూరి వీరేశలింగం పంతులు గారు మీరు సంఘసంస్కర్తయే కాదు బహుముఖ ప్రజ్ఞాశీలి
అందుకోండి మీ కివే
మా శతకోటి వందనములు………!!
………………………….
పేరు అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
9963265762
…………………………….

Get real time updates directly on you device, subscribe now.