శీర్షిక :- ఓ కలికి చిలక
కను రెప్పలు వేయవే చిలక
నిద్దురబోని కనుపాపలు రెండు
అరుపులు చాలించవే ఇక
ఊరు సద్దుమణిగే చూడిక..
ఎవరి పాపం వారిదేలే జరిగేది జరగనిలే..
చితికి ఛిద్రం అవుతూ రోజు చిన్నబోకే
అలసి ఆగిపోదా చిన్ని గుండె చూడే
జడిసి బెదిరి పోదా చిట్టి మనసు కాదే…
గొడవ పడక నీతో నువ్వే
కాస్త ఓర్చుకోవే…అందాల చిలక
నీలో నువ్వే బోరుమని ఏడవక
లోకమేమి నీ శత్రువు కాదు
కాలమేమి నీ సొంతం కాదు
జరిగేవన్నీ.. నీ కొరకే కాదు
సూత్రదారి ఆడే నాటకాలు ఎవరికి అర్థం కాదు…
కళ్ళు మూసుకోవే యేది నీకు కానరాదు
నువ్వు చూసేవన్నీ భ్రమలే ఆ
భ్రమలను నమ్మి నూ మోసపోకే సుమ్మి
నీది కాని లోకంలో ఎందుకు నీకు గొడవ…
నీ బతుకు తీర0 తెలియని నదిలో సాగే పడవ
ఒకరికి ఒకరు ఏమీ కారు ఎందరు వున్నా..
ఎవరికి వారే అంతా యమునా తీరు
కలలతో వచ్చేవే కష్టం నష్టాలు..
ఆశలతో ముడి పడివే బంధం అనుబంధాలు…
ఏబంధం ఎవ్వరిని ఆపదులే దారం తెగిన నాడు గాలిపటం నిలువదులే
క్షణాల సుఖాల కోసం క్షణిక ఆ వేశాలతో ఆత్రం పడతావెందుకు…
గాయపడి నిరంతరం రోదిస్తావెందుకు.. ఆత్మను వేదిస్తావెందుకు..
గాజుల నరసింహ
9177071129